ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆ విద్యార్థిని పేరు హరిత. ఆమె ఇంటర్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. పైగా, ఎంసెట్‌లో మంచి ర్యాంకు కూడా వచ్చింది. కానీ, ఆ పై చదువులు తల్లిదండ్రులు చదివించరన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన హరిత అనే విద్యార్థిని ఎంసెట్‌లో ర్యాంకులో వచ్చింది. అయినప్పటికీ తల్లిదండ్రులు చదివించరనే మనస్తాపంతో ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు హరిత రాసిన రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.