వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ పేషెంట్ పరిస్థితి దారుణంగా మారింది. మణిపూర్‌లో జననావయవాల్లో ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన పాపానికి పేషెంట్ ప్రైవేట్ పార్ట్ తొలగించారు వైద్యులు. సర్జరీ అనంతరం మత్తు నుంచి తేరుకున్న బాధితుడు జననాంగాలను తొలగించిన విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.
మణిపూర్ రాష్ట్రం జిరిబామ్ జిల్లాకు చెందిన అటికూర్ రెహ్మాన్‌కు జననావయవాల్లో ఇన్‌ఫెక్షన్ సోకడంతో చికిత్స కోసం అసోం రాష్ట్రం సిల్చార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు.
బయోస్పీ తర్వాత సర్జరీ చేసి పేషెంట్ ప్రైవేట్ పార్ట్ తొలగించారు. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.