Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నుపుర్ శర్మను ఉరి తీయాలి: ఎంఐఎం ఎంపి ఇంతియాజ్

Nupur sharma
, శనివారం, 11 జూన్ 2022 (11:38 IST)
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా ఎఐఎంఐఎం పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ మాట్లాడుతూ, సస్పెండ్ చేయబడిన బిజెపి నాయకురాలు నుపుర్ శర్మను సులభంగా వదిలేస్తే 'అలాంటివి' ఆగవని అన్నారు. ప్రవక్త మొహమ్మద్‌కు వ్యతిరేకంగా కొంతమంది బిజెపి నాయకులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు మరియు ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే.

 
దీనిపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఎంపీ ఇంతియాజ్ జలీల్ మాట్లాడుతూ... సస్పెండ్ అయిన బిజెపి నాయకురాలు నుపుర్ శర్మను ఉరిశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. "ఏ మతం, వర్గానికి వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలి" అని ఆయన అన్నారు.

 
నుపుర్ శర్మ వ్యాఖ్యల నేపధ్యంలో దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలపై వివిధ గల్ఫ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత, దేశంలో పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. మైనారిటీలకు వ్యతిరేకంగా నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తర్వాత వివాదం చెలరేగడం గమనార్హం. కొన్ని గల్ఫ్ దేశాలు కూడా తమ నిరసనను తెలిపాయి. అయితే, ప్రవక్త మొహమ్మద్ గురించిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవని భారతదేశం గురువారం పునరుద్ఘాటించింది. వ్యాఖ్యలు చేసిన వారిపై సంబంధిత వర్గాలు చర్యలు తీసుకున్నాయని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐక్యరాజ్య సమితిలో హిందీ భాషకు స్థానం.. భారత తీర్మానానికి సర్వసభ్య సభ ఆమోదం