కరోనా టీకా తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందడం ఇప్పుడు మరింత సులభతరంగా మారింది. వాట్సాప్ ద్వారా సెకండ్ల వ్యవధిలోనే ఈ ధ్రువపత్రం పొందవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా మారింది.
కరోనా టీకా తీసుకున్నట్లు ధ్రువపత్రం సమర్పించిన వారికే ప్రయాణ అనుమతి లభిస్తోంది. ప్రస్తుతం కోవిన్ పోర్టల్ ద్వారా ఈ సర్టిఫికెట్ పొందే సదుపాయం ఉంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ పోర్టల్ మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.