విద్యాసంవత్సరానికి విద్యార్థులకు నూతన బస్ పాస్లు ఈనెల 9వ తేదీ సోమవారం నుంచి జారీ చేయనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జి. నాగేంద్రప్రసాద్ తెలిపారు. ఉచిత బస్పాస్లు 12 ఏళ్లలోపు బాలురకు( 7వ తరగతి వరకు), 18 సంవ త్సరాలలోపు బాలికలకు (పదో తరగతి వరకు జారీ చేయనున్నట్లు తెలిపారు.
బస్ పాస్ దరఖాస్తులను www.apsrtcpass.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాల న్నారు. దరఖాస్తులు పూర్తి చేసి ఫొటోపైన, బోనఫైడ్ సర్టిఫికెట్ కాలమ్ ప్రిన్సిపల్ లేదా ప్రధానోపాధ్యా యుడు సంతకం చేయించాలన్నారు. పాఠశాల, కళాశాల యాజమాన్యాలు తమ వద్ద చదువుతున్న విద్యా ర్థుల జాబితాను బస్ పాస్ సెక్షన్లో అందజేయాలని కోరారు.
విజయవాడలో పండిట్ నెహ్రూ బస్ స్టేష న్ లోని బస్ పాస్ కౌంటర్లతోపాటు జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, తిరువూరు, జగ్గయ్యపేట, నూజివీడు, గన్నవరం, ఉయ్యూరు లలో నూతన బస్ పాస్లు జారీ చేస్తారన్నారు. ఆటోనగర్, కంకి పాడు, ఇబ్రహీంపట్నం కౌంటర్లలో పాస్లు రెన్యూవల్ మాత్రమే చేస్తారన్నారు.
కళాశాల విద్యార్థులు దరఖాస్తు ఫారంతో పాటు పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా జత చేయాలన్నారు.