Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థుల్లో వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి: విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

Advertiesment
Business Entrepreneurship
, మంగళవారం, 20 జులై 2021 (20:16 IST)
విద్యార్థుల్లో వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి కోసం కృషి జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గేమ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో విద్యార్థులకు చేపట్టిన వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మంత్రి ప్రారంభించారు. 
 
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 9 నుండి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు నాయక ఉన్న త్వం పేరుతో వ్యాపార వ్యవస్థాపక నైపుణ్య అభివృద్ధి శిక్షణకార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సమగ్ర శిక్ష గేమ్ (గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్) భాగస్వాము లైన ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ ,ప్రోగ్రాం పార్ట్నర్స్ మేకర్ ఘాట్ ,రీప్ బెనిఫిట్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.
 
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం 21వ శతాబ్దపు సహజ నైపుణ్యాలను విద్యార్థుల్లో గుర్తించేలా చేయడం, వారిలో ధైర్యాన్ని నెలకొల్పడం ,కొత్త విషయాలు తెలుసుకోవడం ,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ,ఆర్థిక స్థిరత్వాన్ని గురించి ఆలోచించేలా చేయడం. ఈ covid 19 పాండమిక్ సమయం ముఖ్యంగా విద్యార్థులకు పాఠశాల , కాలేజీ , వృత్తి విద్య నుంచి ఒక మార్కెట్ వ్యాపారం వైపు ఆలోచించే విధంగా అవకాశాన్ని  కల్పిస్తుంది.
 
విద్యార్థుల సుస్థిర అభివృద్ధికి ఈ కార్యక్రమం యొక్క అవసరాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సంస్థల భాగస్వామ్యంతో విద్యార్థుల సామర్థ్యాలు ,నైపుణ్యాలు ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తూ వస్తోంది. విద్యార్థులు చుట్టూ ఉన్న సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ పాఠ్యాంశాల రూపకల్పన జరిగింది.
 
ఈ ప్రా జెక్ట్ యువత  యొక్క సర్వతోముఖ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.  అంతే కాక 21 వ శతాబ్దపు నైపుణ్యాలకు అవసరమైన వ్యవస్థాపక మరియు అవసరమైన సామర్థ్యాలను ప్రోత్సహిస్తుంది. స్వాతంత్ర్యం, ఆత్మ విశ్వాసం, స్వీయ-అవగాహన, , సమస్య పరిష్కారం, అపరిమిత  ఆలోచనలు పెంపొందించడం వంటివిఈ ప్రాజెక్ట్ ముఖ్య  లక్ష్యాలు.
 
9-12 తరగతుల విద్యా  ర్థుల కోసం ఈ కార్య  క్రమం అమలు చేయబడుతుంది.
AM గేమ్ క్రింది  ఫలితాలను  లక్ష్యం గా పెట్టు కున్నది. వ్యవస్థాపకత ను పెంపొం దించడం, యువ ఉద్యోగార్ధులను మొదటి సారి వ్యవస్థాపకులుగా మార్చడం, యువత వ్యవస్థాపక వెంచర్లను స్థాపించడానికి మరియు కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. ఈ అవగాహన ఒప్పందం మూడేళ్ల కాలానికి ఉంటుంది.
 
తాత్కాలిక దశల వారీ రోల్ అవుట్ ప్లాన్:
దశ 1 - కెజిబివి నుండి కొన్ని పాఠశాలలు మరియు రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు
 
దశ 2 - పాఠశాల విద్య, భారత ప్రభుత్వము నిర్ణయించిన విధంగా అన్ని కెజిబివి పాఠశాలలు మరియు అదనపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు
 
3 వ దశ - ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఉన్న త పాఠశాలలు
కార్యాచరణ ప్రణాళిక
GAME కన్సార్టియం సమగ్ర శిక్ష & SCERT- AP సహాయంతో 10 రోజుల పైలట్ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది.
 
ఈ కార్యక్రమంతో పాటు వాసవ్య మహిళామండలి (NGO) నిర్వహిస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు కోవిడ్ నియంత్రణ పై జరుపతలపెట్టిన శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. యూట్యూబ్ ద్వారా నిర్వహిస్తున్న మార్పుకు నాంది మీరే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమం లో ప్రిన్సిపల్ సెక్రటరీ బి. రాజశేఖర్, డైరెక్టర్ చిన్నవీరభద్రుడు, సమగ్ర శిక్ష ఎస్పీడి వెట్రిసెల్వి, సి మాట్ డైరెక్టర్ మస్తానయ్య, ఎస్ సి ఈ ఆర్టీ డైరెక్టర్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదర్శ స్మారకాలుగా ఏపీలోని 3 చారిత్రక కట్టడాలు: కిషన్ రెడ్డి