Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ పార్టీలకు అఖిలపక్ష సమావేశానికి నో ఎంట్రీ!.. ఎందుకబ్బా?

Advertiesment
ఆ పార్టీలకు అఖిలపక్ష సమావేశానికి నో ఎంట్రీ!.. ఎందుకబ్బా?
, శుక్రవారం, 19 జూన్ 2020 (19:46 IST)
భారత్‌, చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు ఘర్షణలపై ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 20 రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. కానీ ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీహార్‌లో ప్రతిపక్షపార్టీ రాష్ట్రీయ జనతా దళ్‌లను ఆహ్వానించలేదు.

తమకు ఆహ్వానం అందకపోవడంపై ఆప్‌ ఎంపి సంజరుసింగ్‌ విస్మయం వ్యక్తం చేశారు. ''కేంద్రంలో ఆహాంకారంతో కూడిన వింత ప్రభుత్వం అధికారంలో ఉంది. దేశరాజధాని ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఇక పంజాబ్‌లో ప్రధాన ప్రతిపక్షం. దేశవ్యాప్తంగా ఆప్‌కు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు.

అయినా, అతి ముఖ్యమైన అంశాన్ని చర్చించే ఈ సమావేశంలో అప్‌ పాల్గనకూడదని బిజెపి భావిస్తోంది'' అని సంజరుసింగ్‌ ట్వీట్‌ చేశారు. కాగా ఈ సమావేశానికి రాష్ట్రీయ జనతాదళ్‌కు కూడా ఆహ్వానం అందలేదు. ''మా పార్టీకి ఆహ్వానం అందకపోవడం విచారకరం. దురదృష్టకరం.

21 రాష్ట్రాల్లో వ్యాపించి ఐదుగురు ఎంపీలు ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు ఉన్న ఆర్జేడీ బీహార్‌లోనే అతిపెద్ద పార్టీ. అంతేకాకుండా గల్వాన్‌ ఘటనలో బీహార్‌ రెజిమెంట్‌కు చెందిన ఐదుగురు ప్రాణాలు కొల్పయారు. ఈ విషయంపై మాకు అనేక సందేహాలు ఉన్నాయి.

మేము ప్రధానితో అనేక సలహాలు చర్చించాలనుకున్నాం. అసలు పార్టీల ఎంపిక ఏ ప్రాతిపదిక జరిగిందో అర్ధం కావడం లేదు'' అని ఆర్జేడి ఎంపి మనోజ్‌కుమార్‌ విమర్శించారు.

దీనిపై ప్రభుత్వం వివరణనిచ్చింది. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన వాటిని, ఐదుగురు కన్నా ఎక్కువ ఎంపీలు ఉన్న పార్టీలను, కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలను, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలకు మాత్రమే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం పలికినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంతోష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండ.. రూ.కోట్లు, నివాస స్థలం.. భార్యకు గ్రూప్1 ఉద్యోగం