Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేపు ప్రధాని అధ్యక్షతన ఆల్‌ పార్టీ మీటింగ్‌

రేపు ప్రధాని అధ్యక్షతన ఆల్‌ పార్టీ మీటింగ్‌
, గురువారం, 18 జూన్ 2020 (16:04 IST)
ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోడీ అధ్యక్షతన ఆల్‌ పార్టీ మీటింగ్‌ జరగనుంది.

శుక్రవారం సాయంత్రం 5గంటలకు అన్ని పార్టీల చీఫ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ అవుతారని పీఎం ఆఫీస్‌ వెల్లడించింది. 'ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్ని పరిస్థితులపై చర్చించేందుకు మోడీ అధ్యక్షతన మీటింగ్‌ జరగనుంది.

వివిధ పార్టీల ప్రెసిడెంట్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ భేటీలో పాల్గొంటారు' అని పీఎంవో ఇండియా ట్వీట్‌ చేసింది. లడఖ్‌లోని గాల్వాన్‌ వ్యాలీలో సోమవారం అర్ధరాత్రి చైనా ఆర్మీతో జరిగిన గొడవలో 20 మంది మన జవాన్లు అమరులై వీర మరణం పొందారు. కాగా.. ఈ ఘటనపై ప్రధాని మోడీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ విమర్శించారు.
 
సైనికుల మరణం కలచివేసింది: రాజ్‌నాథ్‌ సింగ్
లడాఖ్‌లో సైనికుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, బాధకు గురి చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఈ సందర్భంగా అమరులైన వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషయంపై ఆయన ట్వీట్‌ చేశారు.

“గల్వాన్‌లో సైనికులను కోల్పోవడం తీవ్రమైన బాధకు గురిచేసింది. నన్ను కలచివేసింది. విధి నిర్వహణలో మన సైనికులు ఆదర్శప్రాయమైన, ధైర్యం, శౌర్యాన్ని ప్రదర్శించారు” అని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు. సైనికుల త్యాగాన్ని దేశం ఎప్పిటికీ మరిచిపోదని అన్నారు. సైనికుల కుటుంబాలకుప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కష్ట సమయంలో దేశం మొత్తం సైనికుల కుటుంబాలకు అండగా ఉంటుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఇండియా– చైనా బోర్డర్‌‌లో గత కొద్ది రోజులుగా ఉన్న పరిస్థితులు సోమవారం ఉద్రిక్తంగా మారాయి. లడాఖ్‌లో మన సైనికులపై చైనా ఆర్మీ దాడి ఆకస్మికంగా దాడి చేయడంతో 20 మంది అమరులైన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్-19పై అపోహలను ఛేదిద్దాం-వివక్షను అరికడదాం!