Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్-19పై అపోహలను ఛేదిద్దాం-వివక్షను అరికడదాం!

webdunia
గురువారం, 18 జూన్ 2020 (15:48 IST)
దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఇటువంటి తరుణంలో వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు నిత్యం వారి ప్రాణాలను ఫణంగా పెట్టి మన కోసం ముందుండి పోరాడుతున్నారు.

మనం క్షేమంగా ఉండాలని వాళ్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో కొందరు కోవిడ్-19 బారినపడ్డారు. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్న వారిపట్ల ప్రజలు వివక్ష చూపకూడదు. 
 
ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవలను ప్రశంసించాలి. అంతేకాని వారు, వారి కుటుంబాల పట్ల వివక్ష చూపడం నేరం. అదే విధంగా వారి గురించి గానీ, కోవిడ్-19 గురించి గానీ తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదు. 
 
ఈ సంక్షోభ సమయంలో పుకార్లు మరియు తప్పుడు సమాచారం వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల్లో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. 
 
అంతే కాకుండా ఇటువంటి పరిణామాలు కోవిడ్-19 బాధితుల రికవరీపైనా ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
కోవిడ్-19 సంబంధిత వివక్ష (అపోహ) మూడు ప్రధాన కారకాలపై ఆధారపడి ఉంటుంది:
 
తగిన సమాచారం లేకపోవడం ,వ్యాధి పట్ల భయం పుకార్లు లేదా తప్పుడు సమాచారం
 
కళంకం మరియు వివక్షను ఎదుర్కొంటున్న వ్యక్తులు:
కోవిడ్-19 తో బాధపడుతున్న వ్యక్తులు, వారి కుటుంబాలు / సంరక్షకులు / స్నేహితులు

నిర్బంధంలో ఉన్న వ్యక్తులు మరియు వారి కుటుంబాలు:
వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఫీల్డ్ వర్కర్స్, హాస్పిటల్ వంటి ఫ్రంట్‌లైన్ హెల్త్ కేర్ ప్రొవైడర్లు మరియు పారిశుద్ధ్య కార్మికులు మొదలైనవారు 
 
కోవిడ్-19 నుంచి కోలుకున్న వారు, వలస కార్మికులు
 
కళంకం మరియు వివక్ష వల్ల మనుషులపై ఏవిధంగా ప్రభావం చూపుతాయి?:
వైరస్ లక్షణాలు ఉన్నా దాచిపెట్టడం, వైద్య చికిత్స పొందడానికి సంకోచించడం, హోమ్ క్వారంటైన్ కు ప్రజలు కట్టుబడి ఉండకపోవడం, ఒంటరితనం, అపరాధ భావన మరియు ఆందోళన పెరిగిపోవడం, మనుషుల ఆత్మగౌరవం మరియు విశ్వాసాలపై ప్రభావం చూపడం, కోవిడ్-19 నిర్వహణలో పాలుపంచుకునే వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఇతరులను వివక్ష చూపడం, మానసికంగా క్రుంగిపోయి చివరకు డిప్రెషన్ లోకి వెళ్లడం 
 
వివక్ష లేదా కళంకం కారణంగా కింది పరిస్థితులకు దారితీయవచ్చు:
కోవిడ్-19 కేసుల గురించిన నివేదికలు సరైన సమయానికి రాకపోవడం. కోవిడ్-19 వ్యాప్తి నిర్వహణ మరింత కష్టతరం అవుతుంది. అవసరమైన నివారణ చర్యలు తీసుకోవడంలో సమస్యలు తలెత్తవచ్చు.
 
కోవిడ్-19 గురించి తెలుసుకోవలసిన విషయాలు:
1. కోవిడ్-19 ప్రమాదకరమైన అంటువ్యాధి అయినప్పటికీ  భౌతిక దూరం పాటించడం ద్వారా, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం మరియు ముఖానికి మాస్కులు ధరించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
 
2. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ  ఒక వ్యక్తి కోవిడ్-19 బారిన పడవచ్చు. అంతమాత్రాన అది అతడు / ఆమె తప్పు కాదు. ఎవరైనా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు.
 
3. బాధల్లో ఉన్న రోగికి మరియు సంబంధిత కుటుంబానికి మద్దతు మరియు సహకారం అందించాల్సిన అవసరం ఉంటుంది.
 
4. స్వీయ నిర్బంధం / క్వారంటైన్ లో  ఉన్నవారికి మరియు వారి కుటుంబాలకు అండగా ఉండాలి.
 
 5. కోవిడ్-19 నుంచి కోలుకున్న వారిని ఆ వైరస్ ను జయించిన వారిగా పరిగణించండి. వారి వల్ల ఇతరులకు ఎలాంటి ప్రమాదం ఉండదు, వైరస్ సంక్రమణ జరగదు.   
 
చేయాల్సినవి:
విపత్కర పరిస్థితుల్లో మనకు అవసరమైన సేవలను అందిస్తున్న వ్యక్తులను అభినందించండి. వారికి వారి కుటుంబసభ్యులకు అండగా ఉండండి.
 
కోవిడ్-19 కు సంబంధించిన సమచారాన్ని  సామాజిక మాధ్యమాల్లో పంచుకునే ముందు అది వాస్తవం అని నిర్ధారించుకున్నాకే పంపండి. కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి గురుంచి సానుకూల కథనాలను విస్తృతంగా తెలియజేయండి
 
చేయకూడనివి:
కోవిడ్-19 బారినపడిన, క్వారంటైన్ లో ఉన్నవారి పేర్లను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేయడం
భయం మరియు భయాందోళనలను వ్యాప్తి చేయడం 
వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు మనకోసం కష్టపడుతున్నా వారిని లక్ష్యంగా చేసుకోవడం
కోవిడ్-19 యొక్క వ్యాప్తికి ఏదైనా సంఘం లేదా ప్రాంతాన్ని కారణంగా చూపడం
కోవిడ్-19 బారినపడి చికిత్ప పొందుతున్నవారిని బాధితులుగా చిత్రీకరించడం
వివక్షతను అరికడదాం!  కోవిడ్-19 నిర్మూలనకై కలిసి పోరాడదాం!!

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

పిచ్చికుక్క‌ల‌ స్వైర‌విహారం, 10 మందికి తీవ్ర‌గాయాలు