Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ రెండు పార్టీలు కలిస్తే...? వైసీపీలో ఆందోళన!

Advertiesment
ఆ రెండు పార్టీలు కలిస్తే...? వైసీపీలో ఆందోళన!
, బుధవారం, 15 జనవరి 2020 (09:59 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఢిల్లీలో పలువురు కేంద్ర పెద్దలను కలిసి, బీజేపీతో పొత్తు వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 16న ఇరు పార్టీల అగ్రనాయకత్వం సమావేశం కానుంది. ఆరోజే పొత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. 

2014 ఎన్నికల్లో తెలుగుదేశం-బీజేపీకి సపోర్ట్ చేసిన పవన్ 2019లో సింగిల్‌గా పోటీ చేసి ఓడిపోయారు. దీనికి తోడు రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బీజేపీతో వెళ్లడమే సరని నిర్ణయించుకున్నారు.

జగన్ దూకుడును కట్టడి చేయాలంటే కమలం పార్టీతో జట్టుగా వెళ్తే మంచిదని పవన్ భావిస్తున్నట్టున్నారు. అందుకే పవన్ బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉంటున్నారు. రాష్ట్ర పరిస్థితులను వాళ్లకు వివరిస్తున్నారు. పవన్ తాజా ఢిల్లీ పర్యటన కూడా ఇందులో భాగమేనని తెలుస్తోంది.
 
త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తుండటంతో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే బెటర్ అనే అభిప్రాయం కూడా రెండు పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. ఈ మేరకు బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.

సంక్రాంతి తర్వాత బీజేపీ, జనసేన పొత్తుపై ప్రకటన వెలువడుతుంది. మరోవైపు పవన్ ఢిల్లీ పెద్దలను కలవడంపై వైసీపీలో గుబులు మొదలైంది. బీజేపీ, జనసేన కలిస్తే తమకు కొంచెం ఇబ్బందికరమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
 
ఇప్పటికే మూడు రాజధానుల విషయంలో జనసేన వైసీపీని తూర్పారపడుతోంది. పవన్ పదునైన విమర్శల వెనుక బీజేపీ అండ ఉన్నట్లు వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ, జనసేన బంధం బలపడితే తమకు గడ్డుకాలం తప్పదని కూడా వైసీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14 ఏళ్లుగా ఆమెకు టీయే ఆహారం