Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యతో హనీమూన్‌కి వెళ్లాడు... పొట్టపై ఆ కుట్లు.. ఆపై ఏం జరిగిందంటే?

Advertiesment
భార్యతో హనీమూన్‌కి వెళ్లాడు... పొట్టపై ఆ కుట్లు.. ఆపై ఏం జరిగిందంటే?
, గురువారం, 9 జూన్ 2022 (11:03 IST)
శోభనం గదికి వెళ్లిన కొత్తపెళ్లి కొడుకుకు షాక్ తప్పలేదు. పెళ్లయ్యాక భార్యతో హనీమూన్‌కి వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్న అతడి ఆశలు ఆవిరయ్యాయి. పెళ్లికి ముందే గర్భం దాల్చి అబార్షన్ చేసుకున్న కొత్త భార్య కుట్రను పసిగట్టి పుట్టింటికి పంపేశాడు. దీంతో భార్య తిరిగి తనపైనే కేసు పెట్టడంతో ఆ యువకుడు చివరికి పోలీసులను ఆశ్రయించాడు.
 
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా, అశోక్ నగర్‌కు చెందిన ఓ యువకుడు ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సరదాగా హనీమూన్‌కి తీసుకెళ్లాడు. అక్కడ మొదటి రాత్రి భార్య పొట్టపై కుట్లు వేసిన గుర్తులను గమనించి ప్రశ్నించగా, ఆమె ఏదో చెప్పి మ్యానేజ్ చేసింది. 
 
అలా రెండు మూడు రోజులు గడిచిన తర్వాత భార్య ఎవరితోనో తరచుగా ఫోన్ మాట్లాడడం చూసి భర్తకు అనుమానం ఎక్కువయింది. దాంతో ఆమె గురించి ఎంక్వైరీ చేయగా, పెళ్లికి ముందే వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందని తేలింది. అంతేకాక, అతనితో గర్బం దాల్చి, ఆపరేషన్ కూడా చేయించుకుందని తెలిసింది. దీంతో ఆగ్రహించిన యువకుడు పెళ్లయిన పది రోజులకే భార్యను పుట్టింటికి పంపేశాడు. 
 
తన గతం గురించి తన భర్తకు తెలియదనుకున్న భార్య పుట్టింట్లో కొన్ని రోజులు బాగానే గడిపింది. కానీ ఎంతకీ తనను తీసుకెళ్లడానికి భర్త రావడం లేదని గమనించి తన భర్తకు అసలు నిజం తెలిసిందని గ్రహించింది. దాంతో సన్నిహితుల సలహా మేరకు భర్తపై గృహ హింస కేసు పెట్టింది. 
 
అంతేకాక, పెద్ద ఎత్తున భరణం ఇప్పించాలని కోర్టుకెక్కింది. ఇటు భర్తను తన బంధువుల ద్వారా బెదిరిస్తూ మనోవేదనను కలిగించింది. దాంతో విసిగిపోయిన భర్త తనకు తన భార్య నుంచి రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం సేవించి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు... ఎక్కడ?