Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యం సేవించి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు... ఎక్కడ?

Advertiesment
drunk and drive test
, గురువారం, 9 జూన్ 2022 (10:46 IST)
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయనున్నారు. ఇందులోభాగంగా, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.
 
పోలీసులు జరిపే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో ఎవరైనా పట్టుబడితో వారి లైసెన్స్‌ను స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించి ఆ తర్వాత రవాణా శాఖకు పంపించారు. ఫలితంగా మూడు నెలల పాటు వారి లైసెన్స్ రద్దు కానుంది. పైగా, ఒకటి మించి ఎక్కువసార్లు పట్టుబడిన వారు భవిష్యత్‌లో మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. 
 
ప్రధానంగా యువకులు ఈ తరహా కేసుల్లో పట్టుబడితే కోర్టు కేసులు ఎదుర్కోక తప్పదన్నారు. అలాగే, ఉద్యోగస్తులు పట్టుబడితో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా, డ్రంకెన్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినపుడు తీవ్రత ఆధారంగా లైసెన్స్‌ను శాశ్వతంగా రద్ద అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 
 
ముఖ్యంగా, మద్యం సేవించి మైనర్లు పట్టుబడితో జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. వాహనాలను అమిత వేగంతో నడుపుతూ పలు అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. వీటికి అడ్డుకట్టే వేసేందుకు పోలీసులు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రూ.42,000ల వరకు శాలరీ