Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమానాశ్రయ చెత్తబుట్టలో శిశువు మృతదేహం!!

Advertiesment
horn with baby

ఠాగూర్

, బుధవారం, 26 మార్చి 2025 (12:11 IST)
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అపుడే పుట్టిన నవజాత శిశువు మృతదేహం బాత్‌రూమ్ చెత్తబుట్టలో కనిపించింది. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో ముంబై విమానాశ్రయంలో టెర్మినల్-2లోని వాష్‌రూమ్‌లో శుభ్రం చేస్తున్న సమయంలో సిబ్బంది ఓ శిశువు మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ప్రయాణికులు, యాజమాన్యం దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
మృతదేహాన్ని పోస్టుమార్టం కోపం పంపి, గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనే విషయాన్ని తెలుసుకోవడానికి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. చిన్నారిని హత్య చేసి ఉంటారా? లేదా మృతశిశువు జన్మించడంలో చెత్త డబ్బాలో పడేసి వెళ్లారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Hyderabad: వేడి నీళ్లతో నిండిన బకెట్‌లో పడి నాలుగేళ్ల బాలుడి మృతి