మరదలిపై బావ అత్యాచారం... పిల్లల్ని చంపేస్తానని బెదిరించి...

సోమవారం, 30 సెప్టెంబరు 2019 (12:34 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. వరుసకు మరదలి అయ్యే మహిళపై బావ అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఆమె పిల్లలను చంపేస్తానంటూ బెదిరిస్తూ గత నాలుగేళ్లుగా ఈ దారుణానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గురుగ్రామ్‌లోని బజ్గేరా గ్రామంలో ఓ వ్యాపారి భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఆయనకు ఇంటి సమీపంలో వరుసకు సోదరుడయ్యే ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. అతను తరచూ తమ్ముడి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతడి భార్యపై కన్నేశాడు. 
 
తన వ్యాపార పనుల్లో తమ్ముడు ప్రతిరోజు ఉదయం బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి వస్తుండటంతో ఇదే అదనుగా భావించిన అన్న ఓ రోజు ఒంటరిగా ఉన్న మరదలుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు సహకరించకుంటే పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తూ గత నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు.

అయితే అతని వేధింపులు భరించలేక తన భర్తకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో అతను స్థానిక పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశాడు. కేసు నమోద చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గ్రామ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త .. సొంత మండలంలోనే...