Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జట్టు నుంచి పీకిపారేసేందుకు లొసుగులు వెతికారు... యువరాజ్ సింగ్

జట్టు నుంచి పీకిపారేసేందుకు లొసుగులు వెతికారు... యువరాజ్ సింగ్
, శనివారం, 28 సెప్టెంబరు 2019 (13:01 IST)
భారత క్రికెట్ జట్టులో మైఖేల్ బెవాన్‌గా గుర్తింపు పొందిన క్రికెటర్ యువరాజ్ సింగ్. ఒంటి చేత్తో అనేక విజయాలను అధించారు. అలాంటి యూవీ.. కేన్సర్ బారినపడి తిరిగి కోలుకున్నాడు. జట్టులోకి వచ్చాడు. అయితే, జట్టులో రాణించలేక పోయారు. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 
 
ఈ రిటైర్మెంట్ వెనుక గల కారణాలను యువరాజ్ సింగ్ తాజా వెల్లడించారు. తాజాగా ఆయన ఓ జాతీయ చానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు జట్టు యాజమాన్యం నుంచి మద్దతు కరువైందని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
2011 తర్వాత మరో ప్రపంచకప్ ఆడలేకపోవడం తనను తీవ్రంగా బాధించిందన్న యువరాజ్.. తనకు సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి ఉంటే మరిన్ని రోజులు క్రికెట్ ఆడి ఉండేవాడినన్నాడు. యోయో టెస్టు పాసైనా జట్టులోకి తీసుకోకపోవడం తనను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.
 
36 ఏళ్ల వయసులో యోయో టెస్టు పాస్ అవుతానని ఊహించని మేనేజ్‌మెంట్.. పాసయ్యేసరికి సాకులు వెతికిందని, దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నెపంతో తనపై వేటేసిందని ఆరోపించాడు. 
 
పదహారేళ్లపాటు జట్టుకు ఆడిన తనను జట్టు నుంచి ఎందుకు తొలగిస్తున్నదీ కూర్చోబెట్టి చెప్పొచ్చని, కానీ అలా చేయలేదన్నాడు. సెహ్వాగ్, జహీర్‌ఖాన్‌ల విషయంలోనూ ఇదే జరిగిందని యువరాజ్ సంచలన ఆరోపణలు చేశారు. యువరాజ్ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ పెద్దలు స్పందించాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్నే కాదు.. సెహ్వాగ్, జహీర్‌లను కూడా పిలిచి మాట్లాడలేదు.. యువీ (Video)