వయసు నిబంధనల సడలింపుపై చాలా రోజుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. నీట్ పరీక్షపై కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
నీట్ ద్వారా అండర్ గ్రాడ్యూయేట్ సీట్లకు పోటీ పడే అభ్యర్థులకు ప్రస్తుతమున్న వయసు నిబంధనను తొలగించారు. ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్లకు పోటీ పడే అభ్య ర్థులు 17 ఏళ్ల వయసు నిండి.. నీట్ ద్వారా అండర్ గ్రాడ్యూయేట్ సీట్లకు పోటీపడే అభ్యర్థులకు ప్రస్తుతమున్న వయస్సు నిబంధనను తొలగించారు.
ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్లకు పోటీపడే అభ్యర్థులు 17ఏళ్ల వయసు నిండి.. 25 ఏళ్లలోపు వారై ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు 30 ఏళ్ల వరకూ అవకాశం ఉంది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2022) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష ఈ ఏడాది జూన్ లేదా జూలైలో జరగనుంది. జూన్ మూడవ వారంలో లేదా జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.