భార్యాభర్తల అనుబంధం గొప్పది. అలాంటి అనుబంధం తెగిపోతే.. ఒక్కసారిగా దూరమైతే ఆ బాధను తట్టుకోవడం కష్టం. అలా ఓ మహిళ భర్తకు దూరమై రెండో వివాహం చేసుకుంది. అయితే మొదటి భర్తను మరిచిపోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మైసూరు నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. హీనా కౌసర్ (27) ఆత్మహత్య చేసుకున్న మహిళ. మైసూరు ఉదయగిరి ప్రాంతంలోని గౌసియా నగరంలో ఆమె నివసిస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వివాదాల వల్ల మొదటి భర్త నుంచి విడిగా ఉంటున్న మహిళ కొన్ని నెలల క్రితం మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుంది.
కానీ ఆమె ప్రతి రోజు మొదటి భర్తను గుర్తుకు చేసుకుంటూ బాధపడేది. బుధవారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొంది. ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.