Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తలాక్ భర్త భార్యకు చెప్పడం.. ఖులా భార్య భర్తకు చెప్పడం.. కీలక తీర్పు

Advertiesment
తలాక్ భర్త భార్యకు చెప్పడం.. ఖులా భార్య భర్తకు చెప్పడం.. కీలక తీర్పు
, గురువారం, 2 ఫిబ్రవరి 2023 (15:59 IST)
ముస్లిం మహిళల విడాకుల వ్యవహారంలో మద్రాస్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. షరియత్ కౌన్సిల్ వంటి ప్రైవేట్ సంస్థలకు బదులుగా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించండం ద్వారా ముస్లిం ఖులా ద్వారా వివాహాన్ని రద్దు చేసుకునే హక్కును ఉపయోగించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. 
 
వివరాల్లోకి వెళితే... ఖులా అనేది ఇస్లాంలో ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చే ఓ ప్రక్రియ. వివాహం సమయంలో భర్త నుంచి పొందిన కట్నం లేదంటే మరేదైనా కానీ తిరిగి ఇవ్వడం.. ఇవ్వకుండా కూడా ఖులా ద్వారా వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు.
 
అయితే, ఇందుకు జీవిత భాగస్వామి కానీ, ఖాదీ (కోర్టు) కానీ అంగీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారికి ఖులా ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. ఇది కూడా తలాక్‌కు మరో రూపం. 
 
తలాక్‌లో భర్త భార్యకు చెబితే ఖులాలో భార్య భర్తకు చెప్పడం అనేది. ఈ నేపథ్యంలో ఖులా సర్టిఫికేట్ రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు.. ఖులా కోసం ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం ద్వారా కూడా ముస్లిం మహిళ భర్త నుంచి విడాకులు పొందవచ్చునని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
 
ప్రైవేట్ సంస్థలు కోర్టులు కావని మద్రాస్ హైకోర్టు తెలిపింది. ప్రైవేట్ సంస్థలు అందించే ఖులా సర్టిఫికేట్లకు ఇకపై విలువ వుండదని జస్టిస్ సి. శరవణన్ స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా అల్లుడు తారకరత్న ప్రాణాలు కాపాడిన బాలకృష్ణకు కృతజ్ఞతలు.. విజయసాయిరెడ్డి