Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్‌తో భర్త చనిపోతే.. భార్య ఏడేళ్ల కుమారుడితో 12వ అంతస్థు నుంచి..?

కోవిడ్‌తో భర్త చనిపోతే.. భార్య ఏడేళ్ల కుమారుడితో 12వ అంతస్థు నుంచి..?
, బుధవారం, 23 జూన్ 2021 (21:31 IST)
కోవిడ్ సోకి భర్తను కోల్పోయిన మహిళకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఇరుగు పొరుగువారు వేధింపులకు గురిచేశారు. సూటీ పోటీ మాటలతో మానసికంగా హింసించారు. అన్నింటిని భరిస్తూ ఏడు సంవత్సరాల కొడుకుతో ఇంట్లోనే కుమిలిపోతూ బతుకుతోందా అభాగ్యురాలు.

కానీ ఇరుగుపొరుగువారు ఆమెను కాకుల్లా పొడుచుకుతిన్నారు. వేధింపులకు గురిచేశారు. వారి వేధింపులకు తాళలేక తన కుమారుడుతో పాటు 12వ అంతస్థు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళ అత్యంత దీన గాథ ముంబైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ముంబైలోని చండీవాలిలో నహరే అమృత్ శక్తి నివాస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న రేష్మా ట్రెంచిల్‌ అనే మహిళ భర్త శరత్ కరోనా సోకి చికిత్స పొందుతూ మే 23న మరణించాడు. ఆమె భర్త వ్యవసాయ కోసం ఉపయోగించే పనిముట్లను ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌కు చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసేవాడు. తనను కొడుకుని ఎంతో అపురూపంగా చూసుకునే భర్త తలచుకుని ట్రెంచిల్ కుమిలిపోయింది. ఆ బాధనుంచి తేరుకోలేకపోతోంది. 
 
కానీ కొడుకు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ట్రెంచిల్‌ తన ఏడేళ్ల కుమారుడితో కలిసి ఒంటరిగా బతుకుతోంది. ఆమెతో ఇరుగుపొరుగు వారు వేధింపులకు గురిచేశారు. కరోనా వుందేమోనని వేధించారు. దీంతో కుమిలిపోయిన ఆమె తన కుమారుడితో కలిసి తాను ఉంటున్న అపార్టమెంట్‌లోని 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
పొరుగింట్లో ఉండే వ్యక్తి తనను వేధిస్తున్నారనీ.. ప్రతి దానికి తనతో గొడవపడుతున్నాడని..వారి వేధింపులు తట్టుకోలేకే ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఉన్న దాని ప్రకారం ట్రెంచిల్‌ పొరుగింటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసిన శాడిస్ట్ భర్త, ఆ తర్వాత?