Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబై క్రిస్టల్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. చిన్నారి 16 మందిని కాపాడింది!

ముంబైలోని 17 అంతస్తుల క్రిస్టల్‌ అపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రికల్‌ వైరింగ్ లోపం వల్ల 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు, 16 మంది గాయాల పాలయ్యారు. పదేళ్ల చిన్నారి చెప్పిన సలహా

Advertiesment
Mumbai
, గురువారం, 23 ఆగస్టు 2018 (11:00 IST)
ముంబైలోని 17 అంతస్తుల క్రిస్టల్‌ అపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రికల్‌ వైరింగ్ లోపం వల్ల 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు, 16 మంది గాయాల పాలయ్యారు. పదేళ్ల చిన్నారి చెప్పిన సలహా పాటించి ఈ 16 మంది తమ ప్రాణాలను దక్కించుకున్నారు. స్కూల్ టీచర్ చెప్పిన పాఠాలను గుర్తు తెచ్చుకుని సరైన సమయంలో పాటించడం ద్వారా తన ప్రాణాలనే కాకుండా మరో 16 మంది ప్రాణాలు కాపాడి హీరోగా నిలిచింది.
 
వివరాళ్లోకి వెళ్తే, బుధవారం ఉదయం 8.32గంటల సమయంలో పదేళ్ల చిన్నారి జెన్‌ సదావర్తేను ఆమె తల్లి కంగారుగా నిద్రలేపేటప్పటికి చుట్టూ మంటలు, దట్టమైన పొగ, అరుపులు, ఆర్తనాదాలతో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పెద్దవాళ్లే ఏమి చేయాలో తెలియక బిక్క చచ్చిపోయి ఉండగా చిన్నారి జెన్ ఏ మాత్రం భయపడకుండా తరగతి గదిలో టీచర్ చెప్పిన పాఠాలను వెంటనే గుర్తుచేసుకుని పాటించి, కిటీకీలను తెరచి మిగతా వారిని కూడా పాటించమని చెప్పండి. 
 
దట్టమైన పొగతో జెన్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకోలేని సమయంలో వారికి నీటితో తడిపిన రుమాలును అందించింది. దాన్ని ముక్కుకు, నోరుకు అడ్డుగా పెట్టుకోమని, అలాగే ముక్కుకు అడ్డంగా దూది కూడా పెట్టుకోమని చెప్పింది. అంతేకాకుండా తన వద్ద ఉన్న కొన్ని బట్టలను చించి పొరుగువారికి కూడా అందించింది. వాటి ద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌ ఊపిరితిత్తుల్లోకి చేరదని చెప్పింది.
 
అంతేకాకుండా మంటలు చూసి భయంతో అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్నవారు లిఫ్టుల వైపు పరుగులు తీస్తుండగా జెన్ వారిని వారించి ఇలాంటి సమయంలో లిఫ్ట్‌లు ఉపయోగించడం మంచిది కాదని, అలాగే అందరూ ఒకేచోట గుంపుగా ఉంటే శ్వాస తీసుకోవడం కష్టమని వివిధ సూచనలు చేసింది. చిన్నారి మాటలను పాటిస్తూ ప్రాణాలను చేతిలో పట్టుకుని ఉన్న ఆ 18 మందిని  అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కిందకు తీసుకొచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు.
 
ఆస్పత్రికి తరలించేలోగా ఇద్దరు మరణించారు, 16 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఎంతో సమయస్ఫూర్తితో ఇంతమంది ప్రాణాలను కాపాడిన జెన్‌ సదావర్తేతో పాటు ఆమెకు ఇవన్నీ నేర్పిన టీచర్‌కు అందరూ ధన్యవాదాలు చెప్పారు. ప్రస్తుతం నెట్టింట జెన్ గురించి చర్చ మొదలైంది. నెటిజన్లు ఆమె గురించి వాదోపవాదాలు ప్రారంభించారు. దీంతో సోషల్ మీడియాలో జెన్ హీరోగా మారిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్‌తో నారా బ్రాహ్మణి భేటీ ఎందుకో తెలుసా?: సుధాకర్ క్లారిటీ