Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అస్తికల్ని సముద్రంలో కలపబోయి.. కుమారుడు వెళ్లిన చోటికే..?

అస్తికల్ని సముద్రంలో కలపబోయి.. కుమారుడు వెళ్లిన చోటికే..?
, సోమవారం, 16 ఆగస్టు 2021 (14:53 IST)
sea
కన్నబిడ్డ ప్రమాదంలో మరణించడంతో ఆ తల్లి కూడా కుమారుడు వెళ్లిన చోటికే వెళ్లిపోయింది. ప్రమాదంలో మరణించిన తనయుడి అస్తికల్ని సముద్రంలో కలిపేందుకు వెళ్లిన ఓ తల్లి మృతదేహంగా ఒడ్డుకు చేరింది. కోవళం బీచ్‌లో ఈ విషాద ఘటన ఆదివారం వెలుగు చూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. తాంబరం సమీపంలోని పెరుంగళత్తూరు గుండు మేడుకు చెందిన వసంతి (42). ఆమె కుమారుడు గోకులన్‌ (21) స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. గత నెల 22వ తేదీ మోటారు సైకిల్‌ ప్రమాదంలో గోకులన్‌ మరణించాడు. ఒక్కగానొక కుమారుడు దూరం కావడంతో వసంతి ఒంటరి అయ్యారు. అతడి అస్తికల్ని ఇంట్లో ఫొటో వద్ద ఉంచి ప్రతి రోజూ పూజ చేస్తూ వచ్చారు. 
 
తీవ్ర శోకంతో ఆమె ఉండటమే కాకుండా, అస్తికల్ని ఇంట్లోనే ఉంచుకోవడాన్ని బంధువులు ఖండించారు. అస్తికల్ని సముద్రంలో కలిపేయాలని సూచించారు. దీంతో ఆమె శనివారం అస్తికల్ని సముద్రంలో కలిపేందుకు కోవళం బీచ్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి చేరకపోవడంతో జాడ కోసం బంధువులు గాలించారు. పోలీసులకు సమాచారం అందించారు.
 
ఆమె ఫోన్‌ రింగ్‌ అవుతున్నా, ఎవ్వరూ తీయ లేదు. ఎట్టకేలకు ఓ వ్యక్తి ఆ ఫోన్‌ను అందుకుని బీచ్‌లో పడి ఉన్నట్లుగా సమాచారం ఇచ్చాడు. కోవళం బీచ్‌కు వెళ్లి అక్కడి జాలర్ల వద్ద విచారించగా, ఓ మహిళ గంటల తరబడి సముద్రం ఒడ్డున అస్తికలతో ఓ చోట కూర్చుని తీవ్రంగా ఏడుస్తున్నట్లుగా తెలిపారు. 
 
కదిలించినా ఆమె మాట్లాడక పోవడంతో పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈక్రమంలోనే ఆమె మృతదేహం ఒడ్డుకు చేరింది. తీవ్ర మనో వేదనతో ఉన్న వసంతి అస్తికల్ని సముద్రంలో కలిపి తర్వాత బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీడా బి.టెక్ అమ్మాయిని ప్రేమించేది? ఫేస్ బుక్ మాయాజాలం!!