Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

Advertiesment
encounter

ఠాగూర్

, గురువారం, 23 అక్టోబరు 2025 (11:03 IST)
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీహార్‌కు చెందిన మోస్ట్ వాంటెండ్ గ్యాంగ్‌‍స్టర్లు హతమయ్యారు. మృతుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం రాత్రి ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసుల జాయింట్ ఆపరేషనులో మొత్తం నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు.
 
రాజధానిలో ఈ ముఠా కదలికలపై నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు ఈ ఎన్‌కౌంటర్ నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున 2:20 గంటలకు ఈ కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటరులో మరణించిన గ్యాంగ్‌స్టర్లను.. రంజన్ పాఠక్ (25), బిమ్లేష్ మహైూ అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25), మనీష్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21)గా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు నిందితులు బీహార్లో అనేక క్రిమినల్ కేసుల్లో వాంటెడ్ లిస్టులో ఉన్నారు. 
 
సిగ్మా అండ్ కంపెనీ పేరుతో చెలరేగుతున్న ఈ ముఠాకు రంజన్ పాఠక్ వహిస్తున్నాడు. బీహారులో నమోదైన అనేక కేసుల్లో ఈ నలుగురు పరారీలో ఉన్నారు. అక్టోబరు అర్థరాత్రి బీహార్ పోలీసులు, ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా రోహిణిలోని డాక్టర్ అంబేద్కర్ చౌక్, పన్సాలి చౌక్ మధ్య ఉన్న ప్రాంతంలో బహదూర్ షా మార్గా నలుగురు గ్యాంగ్‌స్టర్లను ఢిల్లీ పోలీసులు కాల్చి చంపారు.
 
బీహార్ ఎన్నికలకు ముందు ఈ నలుగురు పెద్ద కుట్రకు ప్రణాళిక వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతలో ఢిల్లీ, బీహార్ పోలీసు బృందాలు వారిని ఎన్కౌంటరులో హతమార్చడం విశేషం. కాగా ఢిల్లీలోని కరావాల్ నగర్‌కు చెందిన అమన్ ఠాకూర్ తప్ప, మిగిలిన ముగ్గురు గ్యాంగ్లర్లు బీహారులోని సీతామర్హికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికను మూత్ర విసర్జనకు సపోటా తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య