Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రపతికి తప్పిన పెనుముప్పు - బురదలో కూరుకుపోయిన హెలికాఫ్టర్

Advertiesment
helicopter tyre sink

ఠాగూర్

, బుధవారం, 22 అక్టోబరు 2025 (11:35 IST)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పెను ముప్పుతప్పింది. కేరళ పర్యటనలో ఉన్న ఆమె ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణించిన హెలికాఫ్టర్ బురదలో కూరుకునిపోవడంతో ఈ సంఘటన జరిగింది. హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో బురదలో కూరుకునిపోయింది. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థిని అదుపులోకి తేవడంత అంరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
బుధవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళలో నాలుగు రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె బుధవారం శబరిమల అయ్యప్పస్వామిని దర్శనం చేసుకోవాల్సివుంది. ఇందుకోసం కొచ్చిన్‌లోని ప్రమదం స్టేడియానికి హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. అయితే, హెలికాఫ్టర్ ల్యాండ్ అయిన సమయంలో దాని టైర్లు ఒకవైపు బురదలో పూర్తిగా దిగబడిపోయాయి. 
 
దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో హెలికాఫ్టర్‌ను అతి కష్టంమీద బురద నుంచి బయటకు నెట్టి సురక్షిత ప్రదేశానికి చేర్చారు. ఈ అనూహ్య ఘటనతో షెడ్యూల్ కొద్దిసేపు నిలిచిపోయింది. ఆ తర్వాత రాష్ట్రపతి అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనతో అధికారులు భద్రతా ఏర్పాట్లపై పునఃసమీక్ష చేపట్టారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mana Mitra App: మన మిత్ర మొబైల్ యాప్‌ను ప్రారంభించిన చంద్రబాబు