Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

Advertiesment
Visa

ఠాగూర్

, బుధవారం, 22 అక్టోబరు 2025 (08:55 IST)
అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. హెచ్-1బీ వీసా కోసం ప్రతిపాదించిన లక్ష డాలర్ల (సుమారు రూ.8.3 కోట్లు) భారీ ఫీజు విషయంలో వివరణ ఇచ్చింది. ఇప్పటికే అమెరికాలో ఎఫ్-1 (విద్యార్థి), జే-1 (పరిశోధకులు), ఎల్-1 (అంతర్గత బదిలీ) వంటి వీసాలపై ఉన్నవారు హెచ్-1బీకి మారేటప్పుడు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్ సీఐఎస్) అధికారికంగా ప్రకటించింది. 
 
యూఎస్ఐఎస్ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ ఫీజు నిబంధన అమెరికా వెలుపల నుంచి కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది. ఇప్పటికే అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)లో ఉన్న విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. అలాగే, ప్రస్తుతం హెచ్-1బీపై పనిచేస్తూ వీసాను పునరుద్ధరించుకునేవారికి లేదా వేరే కంపెనీకి మారేవారికి కూడా ఈ ఫీజు వర్తించదని స్పష్టం చేసింది. 
 
అదేసమయంలో ఈ మినహాయింపులకు కొన్ని షరతులు వర్తిస్తాయని యూఎస్ సీఐఎస్ తెలిపింది. ఎవరైనా విద్యార్థి వీసాపై ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక పనులు చేసినట్లు తేలితే, వారికి ఈ మినహాయింపు లభించదు. అలాంటి వారి వీసా మార్పు దరఖాస్తు తిరస్కరణకు గురైతే, వారు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా, ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతుండగా, వారిలో సుమారు లక్ష మంది ఓపీటీలో ఉన్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య