Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

Advertiesment
pav veg vendor

ఠాగూర్

, బుధవారం, 22 అక్టోబరు 2025 (19:40 IST)
దాయాది దేశం పాకిస్తాన్‌లో నిత్యావసరవస్తు ధరలు ఒక్కసారిగా ఆకాశానికంటాయి. ఫలితంగా కిలో టమోటాలు రూ.600, కేజీ అల్లం ధర రూ.750, కేజీ బఠాణీలు రూ.500 పలుకుతోంది. పాకిస్థాన్ - ఆప్ఘనిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు పరస్పరం కాల్పులు జరుపుకుంటున్నారు. దీంతో పాక్ ఆప్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తలు నెలకొనివున్నాయి. ఈ కారణంగా పాకిస్తాన్‌లో నిత్యావసర వస్తు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 
 
ఈ ధరలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం కూడా ఆప్ఘనిస్థాన్ కావడం గమనార్హం. ఆ దేశం నుంచి పాకిస్తాన్‌కు రావాల్సిన కూరగాయలు బంద్ అయ్యాయి. వీటితో పాటు ఇతర కాయగూరలు ధరలు కూడా మండిపోతున్నాయి. కిలో అల్లం ధర రూ.750కి చేరగా, వెల్లుల్లి ధర రూ.400, బఠానీల ధర రూ.500 చొప్పున పలుకుంతోది. ఉల్లిపాయలు ధర కిలోకు రూ.120కి పెరిగింది. అలాగే, క్యాప్సికమ్, బెండకాయలు కిలో ధర రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో ఉచితంగా ఇచ్చే కొత్తిమీర చిన్న కట్ట ఇపుడు రూ.50కి చేరిందని స్థానిక మీడియా వెల్లడించింది. 
 
మరోవైపు, ఒక్కసారిగా ధరలు పెరిగిపోవడంతో చిరు వ్యాపారులు కూరగాయల వ్యాపారం చేయడం మానేశారు. టమోటాలు, బఠాణీలు, అల్లం, వెల్లుల్లి వంటివి పూర్తిగా బంద్ చేశారు. ఇటీవల ఆప్ఘాన్ భూభాగంపై పాకిస్థాన్ వైమానిక దళాలు దాడులుకు తెగబడటం ఆ దేశ శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపడం, వంటి పరిణామాల నేపథ్ంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. దీంతో ఆప్ఘాన్ నుంచి పాకిస్థాన్‌కు సరఫరా అయ్యే అన్ని రకాల వస్తువులు ఆగిపోయాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు