మహిళల వన్డే ప్రపంచకప్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే మూడు టీమ్లు సెమీస్‌కు చేరుకోగా.. నాలుగో బెర్తు ఖరారు కావాల్సి ఉంది. తమకు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్, పాకిస్థాన్ నిష్క్రమించాయి. ఇక భారత్, న్యూజిలాండ్, శ్రీలంక టాప్-4లోకి వచ్చేందుకు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా భారత్ వేదికగానే జరుగనుంది.
నవీ ముంబై ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఐసీసీకి వెసులుబాటు దక్కింది. ఒకవేళ పాక్ ఫైనల్‌కు చేరుకునివుంటే ఆ మ్యాచ్‌ను కొలంబోలో నిర్వహించాల్సి ఉండేది. ఇప్పుడు లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించడంతో ఫైనల్ భారత్‌లోనే జరుగనుంది.
తొలి సెమీస్ (అక్టోబర్ 29)కు ఇంకా వేదికను ఖరారు చేయలేదు. ఆ మ్యాచ్‌కు ఇండోర్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. రెండో సెమీస్ (అక్టోబరు 30) నవీ ముంబైలోనే జరగనుంది. నవంబర్ 2న మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఉంది.