Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మతం పేరుతో దాడి చేస్తే.. ఆ మతానికే కీడు : నరేంద్ర మోడీ

మతం పేరుతో దాడిచేస్తే ఆ మతానికే కీడు కలుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర అన్నారు. భారత్ పర్యటనలో ఉన్న జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో కలిసి ఆయన "ఇస్లామిక్ వారసత్వం : అవగాహన, సంయమనాల ప్రోత్సాహం" అనే అంశంపై ప్

మతం పేరుతో దాడి చేస్తే.. ఆ మతానికే కీడు : నరేంద్ర మోడీ
, గురువారం, 1 మార్చి 2018 (16:31 IST)
మతం పేరుతో దాడిచేస్తే ఆ మతానికే కీడు కలుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర అన్నారు. భారత్ పర్యటనలో ఉన్న జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో కలిసి ఆయన "ఇస్లామిక్ వారసత్వం : అవగాహన, సంయమనాల ప్రోత్సాహం" అనే అంశంపై ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, మతం పేరుతో మానవాళిపై దాడి చేసేవారు నిజానికి ఆ మతానికే కీడు చేస్తున్నారనే విషయాన్ని గ్రహించాలన్నారు. మతం పేరుతో మానవాళిపై దాడి చేసేవారు, తమ దాడుల వల్ల అతి పెద్ద బాధితురాలు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న మతమేనని అర్థం చేసుకోవడం లేదన్నారు.
 
ప్రపంచంలోని అన్ని మతాలకు భారతదేశం ఊయల వంటిదని అభివర్ణించారు. శాంతి అనేది భారతదేశ ఆత్మలోనే ఉందని తెలిపారు. యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అమాయకులపై హింసకు పాల్పడుతున్నారన్నారు.
 
ఆ తర్వాత రాజు అబ్దుల్లా -2 మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరాడటమంటే ముస్లింలకు వ్యతిరేకంగానో, మరో మతంపైనో పోరాటం కాదన్నారు. ఇది విద్వేషంపై పోరాటమని స్పష్టంచేశారు. మతమంటే మానవాళిని కలిపి ఉంచేదని అందరూ భావిస్తారన్నారు. 
 
అవసరంలో ఉన్నవారికి సహాయపడవలసిన కర్తవ్యం ప్రతి ముస్లింకు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. బహుళత్వానికి భారత ప్రజాస్వామ్యం చిహ్నమన్నారు. నమ్మకమే మానవాళిని ఒక్కటిగా ఉంచుతుందని కింగ్ అబ్దుల్లా తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ అలా చేస్తే బాగుండు.. గవర్నర్ మనకు పట్టిన దరిద్రం.. ఇక వెంకయ్య?: శివాజీ