దగ్గు, జ్వరంతో బాధపడుతున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు వైరల్ ఫీవర్ అని వైద్యులు నిర్ధారించారు.
అంతేగాకుండా జ్వరం తగ్గేందుకు తగిన చికిత్స అవసరమని.. కొద్దిరోజులు పూర్తి స్థాయి విశ్రాంతి కావాలని హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. వర్షాకాలంలో తమిళనాడు ప్రభుత్వం ప్రతి వారం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్‌కు కూడా వైరల్ ఫీవర్ సోకింది. విశ్రాంతి లేకుండా సభలు నిర్వహించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభించడంలో నిరంతరం బిజీగా ఉండడం వల్లే సీఎం స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఆయనకు కొద్దిరోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.