Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో- Modi ki guarantee 2023

amit shah
, శనివారం, 4 నవంబరు 2023 (20:36 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కీలక హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. తాజాగా, బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. పెళ్లయిన మహిళలకు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సహాయం సహా మొత్తం 20 హామీలను ఇందులో ప్రకటించారు. 
 
తమను గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్ ను పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుదతామని అమిత్ షా ఈ సందర్భంగా ఓటర్లకు హమీ ఇచ్చారు. పండరియాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. 
 
రెండేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పేద కుటుంబాలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్, క్వింటాలుకు రూ.3100 చొప్పున ధాన్యానికి మద్దతు ధర, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం, మహిళలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. మేనిఫెస్టోకు మోదీకి గ్యారంటీ అని పేరు పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖేష్ అంబానీకి బెదిరింపులు-తెలంగాణ యువకుడి అరెస్ట్