Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు లగ్జరీ కార్లు బహుకరించిన యజమాని.. (Video)

Advertiesment
luxury car

ఠాగూర్

, సోమవారం, 20 అక్టోబరు 2025 (13:13 IST)
తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని దీపావళి కానుకగా అదిరిపోయే బహుమతి అందజేశారు. ఉద్యోగులకు ఏకంగా 51 లగ్జరీకార్లను అందజేశారు. చండీగఢ్‌కు చెందిన ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని తన ఉదారతను చాటుకున్నారు. ఆయన పేరు ఎంకే భాటియా. ఎంఐటీఎస్ గ్రూపు చైర్మన్. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రోత్సహించేలా వీటిని అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
మీడియా కథనాల మేరకు ఎంఐటీఎస్ గ్రూప్ తమ చండీగఢ్ కేంద్రంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఉద్యోగులను గుర్తించి వారికి ఈ కార్లను బహుమతిగా అందించారు. గతంలో కూడా పండుగల సమయంలో భాటియా తన సిబ్బందికి ఇలాంటి విలువైన బహుమతులు ఇవ్వడం గమనార్హం. ఉద్యోగుల పట్ల ఆయనకున్న కృతజ్ఞతాభావానికి ఇది నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
 
ఉద్యోగుల పట్ల ఇంతటి ఔదార్యం చూపించడం వెనుక ఎంకే భాటియా వ్యక్తిగత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు వ్యాపారంలో తీవ్ర నష్టాలు చవిచూసి, 2002లో తన మెడికల్ స్టోర్ మూతపడటంతో దివాళా తీసే పరిస్థితికి చేరుకున్నారు. ఆ తర్వాత పట్టుదలతో 2015లో ఎంఐటీఎస్ గ్రూప్‌ను స్థాపించి, అనతికాలంలోనే విజయవంతమయ్యారు. ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో 12 కంపెనీలు నడుస్తున్నాయి.
 
భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో పాటు కెనడా, లండన్, దుబాయ్ వంటి దేశాలకు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు భాటియా గతంలోనే తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు భాటియా మంచి మనసును ప్రశంసిస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక