Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మణిపూర్‌‍లో మరో దారుణం.. మహిళను వేధించిన బీఎస్ఎఫ్ జవాన్ ...

Jawan
, బుధవారం, 26 జులై 2023 (13:20 IST)
Jawan
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌ ఇప్పటికే రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో అట్టుడికిపోతోంది. గత రెండు మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అశాంతి నెలకొంది. ఈ రాష్ట్రంలో అనేక దారుణాలు జరుగుతున్నాయి. ఇవి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 
 
తాజాగా మరో ఘటన బయటికొచ్చింది. అల్లర్లను అరికట్టేందుకు వచ్చిన బీఎస్‌ఎఫ్‌ జవానే ఏకంగా, ఓ మహిళపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 20న ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని ఓ కిరాణా షాపునకు వచ్చిన మహిళపై అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం జవాను అనుచితంగా ప్రవర్తించాడు. 
 
దుకాణంలో ఆ మహిళ ఒంటరిగా ఉండటం చూసి ఆమెను వెంబడించాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు. యూనిఫామ్‌లో ఉన్న జవాన్‌ మహిళను ఇబ్బందిపెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అతడి దగ్గర ఇన్సాన్‌ రైఫిల్‌ ఉండటం వీడియోలో కన్పించింది.
 
ఈ వీడియో వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. వైరల్‌ అయిన దృశ్యాల ఆధారంగా ఆ జవానును గుర్తించి సస్పెండ్‌ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర పోలీసుల నుంచి ఫిర్యాదు అందుకున్న బీఎస్‌ఎఫ్.. నిందితుడిపై అంతర్గత దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది. అతడిపై చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మతం మార్చుకుని.. పాకిస్థాన్ ప్రియుడిని పెళ్లి చేసుకున్న భారతీయ మహిళ అంజు