Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమార్తెను ప్రేమించాడనీ సుత్తితో చితక్కొట్టారు....

Advertiesment
కుమార్తెను ప్రేమించాడనీ సుత్తితో చితక్కొట్టారు....
, మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (14:26 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తమ కుమార్తెను ప్రేమించాడన్న అక్కసుతో తండ్రీకొడులు ఓ యువకుడిపై దాడి చేశారు. అదీ కూడా సుత్తితో తీవ్రంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 
 
ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మ‌ధ్య‌ప్ర‌దేశ్ షాజ‌పూర్ జిల్లాలోని మాక్సి సిటీకి చెందిన పుష్ప‌క్ భ‌వ్‌సార్ (22) అనే యువకుడు స్థానికంగా ఓ యువ‌తిని గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాల‌ని నిశ్చయించుకున్న ఆ ఇద్ద‌రూ.. ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా వెళ్లిపోయారు. 
 
ఈ వ్యవహరంపై ఇరు కుటుంబాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్ద‌రూ విడివిడిగా ఉండేందుకు పెద్ద‌లు నిర్ణ‌యించారు. దీంతో ఆ ప్రేమికులిద్ద‌రూ తిరిగి త‌మ నివాసాల‌కు చేరుకున్నారు. త‌న బిడ్డ‌ను తీసుకొని వెళ్లిపోయిన పుష్ప‌క్‌పై అమ్మాయి తండ్రి, సోద‌రుడు తీవ్ర ఆగ్ర‌హంతో ఊగిపోయారు. 
 
ఈ క్రమంలో ఆదివారం మార్కెట్‌కు ఒంటరిగా వ‌చ్చిన పుష్ప‌క్‌ను ప‌ట్టుకుని సుత్తితో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. ఈ దృశ్యాల‌ను కొంద‌రు త‌మ మొబైల్స్‌లో చిత్రీక‌రించి వైర‌ల్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై మాక్సి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్‌లో 8.22 క్యారెట్ల వజ్రం లభ్యం.. విలువ రూ.40లక్షలు