Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్పత్రి బయో ప్లాంట్‌లో పుర్రెలు, ఎముకలు - వార్థా జిల్లాలో కలలు

ఆస్పత్రి బయో ప్లాంట్‌లో పుర్రెలు, ఎముకలు - వార్థా జిల్లాలో కలలు
, శుక్రవారం, 14 జనవరి 2022 (13:50 IST)
మహారాష్ట్ర వార్ధా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కలకలం చెలరేగింది. ఈ ఆస్పత్రి ప్రాంగంణంలో ఉన్న బయో గ్యాస్ ప్లాంట్‌లో పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. పిండాల అవశేషాలను కూడా గుర్తించారు. ఇవి స్థానికంగా కలకలం రేపింది. 
 
వార్థా జిల్లాలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అక్రమంగా అబార్షన్లు చేస్తున్నట్టు అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. ఇందులోభాగంగా, వార్థాలోని ఆర్వీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బయోగ్యాస్ ప్లాంట్‌లో 11 పుర్రెలు, 54 పిండాల ఎముకలు లభించాయని సబ్ ఇన్‌స్పెక్టర్ జ్యోత్స్న గిరి వెల్లడించారు. 13యేళ్ల బాలిక అక్రమ అబార్షన్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనప ఏసీపీ సోనూనె మాట్లాడుతూ, బాలికకు అక్రమ అబార్షన్ చేసిన ఐదు రోజుల తర్వాత జనవరి 9వ తేదీన ఈ విషయంలో మొదటి ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసు బృందం కదమ్ ఆస్పత్రిపై దాడి చేసి దాని డైరెక్టర్ రేఖా నీరజ్ కదమ్, నర్సు సంగీత కాలేలను అరెస్టు చేసినట్టు చేసినట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలు ప్రమాదంపై చట్టబద్ధ విచారణ ప్రారంభించాం : రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్