Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మదురై మల్లెలకు భలే డిమాండ్.. కిలో రూ.2వేలు

Advertiesment
Jasmine
, శుక్రవారం, 2 డిశెంబరు 2022 (13:46 IST)
Jasmine
మదురై మల్లెలకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా మదురై మల్లెపువ్వులకు భారీ డిమాండ్ పెరిగింది. దీంతో మదురై మల్లెపూలు కిలో రూ.2000కి అమ్ముడు అవుతున్నాయి. దీంతో జనం షాక్ అవుతున్నా.. మల్లె పూల రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
మధురై మల్లెలు అంటేనే బాగా ఫేమస్. మంచి వాసనతో వుండే ఈ మల్లిని కొనుగోలు చేయడానికి అందరూ ఇష్టపడతారు.
 
వేసవిలో మల్లెపూల ధర తక్కువగా ఉంటుంది. అదే తక్కువ సరఫరా కారణంగా శీతాకాలంలో ధర ఎక్కువగా ఉంటుంది. 
 
ఆ విధంగా గత కొద్ది రోజులుగా మంచు కురుస్తుండటంతో మల్లెల రాక తగ్గింది. దీంతో ఇప్పుడు మార్కెట్‌లో మదురై మల్లెపూలు కిలో రూ.2వేల వరకు విక్రయిస్తున్నారు. 
 
ఈ ధర కొనుగోలుదారులకు ఊరటనిచ్చినా రైతులకు మాత్రం సంతోషాన్ని కలిగించడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము