Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నమ్మశక్యంకాని ధరకు "నథింగ్" ఫోన్ - రూ.6500 ధర తగ్గింపు

nothing phone 1
, శనివారం, 19 నవంబరు 2022 (11:36 IST)
మొబైల్ రంగంలో సరికొత్త టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఫలితంగా అత్యాధునిక ఫీచర్లతో వివిధ కంపెనీలు మొబైల్ ఫోన్లను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. అలాంటి వాటిలో నథింగ్ ఫోన్ (1) కూడా ఒకటి. ఈ ఫోనును నమ్మశక్యంకాని ధరకు ఇపుడు విక్రయానికి ఉంచారు. ఏకంగా, రూ.6500 వేల ధర తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ పోను ధర రూ.27,500గా ఉంది. బ్యాంకు క్రెడిట్ కార్డులపై మరో 1,500 రూపాయల వరకు రాయితీని ఇచ్చారు. పాత ఫోన్ మార్పిడిపై రూ.17,500 మేరకు తగ్గనుంది. 
 
నిజానికి ఈ ఫోన్ ధర రూ.32,900గా నిర్ణయించారు. జూలైలో మరో రూ.1,000 పెంచారు. దీంతో రూ.34 వేలకు చేరుకుంది. ఇపుడు దీని ధర రూ.6,500కు తగ్గించారు. పైగా, 10 శాతం రాయితీని కూడా ఇస్తున్నారు. ఫెడరల్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసే వారికి గరష్టంగా రూ.1,500 మేరకు తగ్గించారు. అంటే అపుడు రూ.26 వేలకే ఈ ఫోన్ లభించనుంది. 
 
ఈ ధరలన్నీ 8జీబీ ర్యామ్, 12జీబీ స్టోరేజీకి లభిచనుంది. ఒకవేళ 12జీబీ వెర్షన్ కావాలంటే రూ.32,499 ధరకు లభించనుంది. దీనిపైనా బ్యాంకు కార్డు ఆఫర్లు, మార్పిడి ఆఫర్లు అమలవుతాయి. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌పై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొచ్చిలో 19ఏళ్ల మోడల్‌పై అత్యాచారం.. కారులో తిప్పుతూ..?