Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వావ్.. కోల్‌కతా సూపర్ రికార్డ్.. మహిళలకు సురక్షిత ప్రాంతం అదొక్కటే?!

Advertiesment
వావ్.. కోల్‌కతా సూపర్ రికార్డ్.. మహిళలకు సురక్షిత ప్రాంతం అదొక్కటే?!
, బుధవారం, 7 అక్టోబరు 2020 (10:07 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. యూపీలో అయితే అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. యూపీ నేరాలకు అడ్డాగా మారిపోయింది. అయితే మహిళలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు కాని ఓ ప్రాంతం మన దేశంలోనే వున్నట్లు తాజాగా ఓ సర్వేలో తేలింది. ఎన్సీఆర్బీ డేటా ఆధారంగా కోల్‌కతా అరుదైన ఘనతను సాధించుకుంది. 
 
కోల్‌కతాలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు అక్కడ సున్నా శాతం నమోదవుతున్నాయని రికార్డ్ అయ్యింది. మెట్రోపోలీస్ స్టాఫ్ కూడా ఎటుంటి రేప్, లైంగిక వేధింపుల వంటి కేసులు నమోదు చేయలేదని వెల్లడించింది. కోల్‌కతాలో 2019వ సంవత్సరం కేవలం 18ఏళ్లు పైబడ్డ వారే లైంగిక కేసుల అంశంలో ఫిర్యాదు చేశారని తెలిపింది. 
 
రీసెంట్‌గా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కోల్‌కతాలో 14 కేసులు నమోదైనట్లు తెలిపింది. కోల్‌కతా తరహాలోనే మాదిరిగానే తమిళనాడు, కొయంబత్తూరులలో ఎటువంటి లైంగిక వేధింపుల కేసు నమోదు కాలేదని ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
 
కోల్‌కతా నగరం మహిళలకు సురక్షిత ప్రాంతంగా వుందని.. చక్కటి నియమాలు అక్కడి ప్రజలు అనుసరిస్తున్నారని ఎన్సీఆర్బీ డేటా తెలుపుతోంది. కోల్‌కతా ప్రజలు చాలా విషయాల్లో అవగాహన పెంచుకున్నారని అక్కడి పోలీసులు చెబుతున్నారు. 
 
ఎన్సీఆర్బీ డేటాను బట్టి ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్‌లో 59 కేసులు ఫైల్ అయ్యాయి. ఢిల్లీలో వెయ్యి 231కేసులు నమోదై టాప్‌లో ఉంది. ఇక మహిళలకు అంత సేఫ్ కాని ప్లేస్‌లలో టాప్‌గా రాజస్థాన్ ఉంది. రేప్‌లు, లైంగిక వేధింపులు, గృహ హింస కేసుల్లో 18 వేల 432 కంప్లైంట్లు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాలంటీర్ల చేతివాటం.. అనర్హులకు వైఎస్ఆర్ చేయూత పథకం..