Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముగ్గురు మహిళలను చంపేసిన బంకమట్టి... ఎక్కడ? ఎలా?

ముగ్గురు మహిళలను చంపేసిన బంకమట్టి... ఎక్కడ? ఎలా?
, మంగళవారం, 6 అక్టోబరు 2020 (10:56 IST)
బంకమట్టి ముగ్గురు మహిళలను చంపేసింది. ఈ విషాదకర ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రంలోని దేవాల్‌బాడి పంచాయతీ పరిధిలో మీర్గా అనే కొండ ప్రాంతం ఉంది. ఇక్కడ ఇంటి కోసం తెల్లటి బంక మట్టి లభ్యమవుతుంది. దీంతో స్థానికులంతా ఆ మట్టిని తెచ్చుకునేందుకు వెళుతుంటారు. ఈ క్రమంలో మట్టి కోసం వెళ్లిన ముగ్గురు మహిళలు... మృత్యువాతపడ్డారు. బంకమట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. వీటి కింద చిక్కుకున్న మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న జమ్తారా ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ అన్సారీ, జిల్లా డిప్యూటీ కమిషనర్‌ అహ్మద్‌ ముంతాజ్‌, డీఎస్పీ అరవింద్‌కుమార్‌ ఉపాధ్యాయ, సీఐ కేదార్‌నాథ్‌తో పాటు పలువురు అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని, రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. జేసీబీల సహాయంతో మట్టి పెళ్లలను వెలికి తీయగా.. ముగ్గురు మహిళల మృతదేహాలు లభించాయి.
 
మృతులను నారాయణపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చైన్పూర్‌లోని కాక్రియాబాద్ టోల్ నివాసితులుగా గుర్తించారు. మృతులు షహ్నాజ్‌ బీబీ(30), జుబీడా బీవీ (25), మెహ్నాజ్‌ ఖటూన్‌ (20) ఉన్నారు. మహిళల మృతదేహాలను పోస్టుమార్టం కోసం జమ్తారా సదర్ హాస్పిటల్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో 67 లక్షలకు చేరిన కరోనా కేసు - తెలంగాణాలో 1983