Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోల్‌కతా హత్యాచారం: నా కుమార్తె డైరీలో ఓ పేజీ చిరిగి వుంది, కానీ...

Advertiesment
Rape

సెల్వి

, శుక్రవారం, 23 ఆగస్టు 2024 (18:30 IST)
జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇంకా ఈ హత్యాచార ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తన కుమార్తెకు డైరీ రాసే అలవాటుందని.. తమ కుమార్తె డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని బాధితురాలి తండ్రి చెబుతున్నారు. అమ్మాయి బ్యాగులో ఎప్పుడూ పర్సనల్‌ డైరీ ఉంటుంది. 
 
దాన్ని ఇప్పటికీ చదవలేదని.. ఆస్పత్రికి వచ్చాక తను రోజు తమతో అన్ని విషయాలు పంచుకుంటుందని.. ఈ ఘటన తర్వాత తన డైరీని చూస్తే అందులో ఓ పేజీ కొంత చిరిగి ఉందనీ దానికి సంబంధించిన ఫొటో తన వద్ద ఉందని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియాకు తెలిపారు. అయితే, అందులో ఏముందనే విషయాన్ని బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడో కాన్పు పేరుతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ... కుర్చీలోనే ప్రసవించిన మహిళ