Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైద్య విద్యార్థిని హత్యాచార కేసులో కీలక పరిణామం!

doctor

ఠాగూర్

, ఆదివారం, 18 ఆగస్టు 2024 (10:21 IST)
కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కాలేజీ ఆస్పత్రికి చెందిన ట్రైనీ మహిళా వైద్యురాల హత్యాచార ఘటన దేశంలో ప్రకంపనలు జరుపుతుంది. హత్యకు నిరసంగా ఆస్పత్రుల వద్ద గట్టి భద్రతను కల్పించాలంటూ వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బంది ఆందోళనలు చేస్తున్నారు. ఇవి తారా స్థాయికి చేరడంతో దేశంలో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. 
 
ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర హోం మంత్రిత్వశాఖ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల నిరసనలకు సంబంధించి ప్రతి 2 గంటలకు ఒక అన్ని రాష్ట్రాలు పరిస్థితిపై నివేదిక అందించాలని కోరింది. కోల్‌కతా హత్యాచారం ఘటనకు నిరసనగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆందోళనలు, శాంతిభద్రతల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరింది. 
 
ఫ్యాక్స్ లేదా ఈ- మెయిల్, వాట్సాప్ ద్వారా కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరవేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా కేంద్రం వివరాలు పంపించడం గమనార్హం.
 
మరోవైపు, వైద్యురాలిపై హత్యాచారం కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు మరోసారి రావాలంటూ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయనను విచారణకు పిలవడం ఇది మూడోసారి కావడం గమనార్హం.  ఘోష్‌ను ఇదివరకే ఆగస్టు 16 (15 గంటలు), ఆగస్టు 17 (13 గంటలు) సీబీఐ ప్రశ్నించింది. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు మళ్లీ హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఘోష్‌పై సీబీఐ ఫోకస్ చేయడం ఆసక్తికరంగా మారింది. 
 
కాగా హత్యాచారం జరిగిన తర్వాత ఘోష్ ప్రతిస్పందన ఏమిటి, విషాదానికి సంబంధించి ఆమె కుటుంబానికి, అధికారులకు ఎవరు తెలియజేశారు? ఎలా తెలియజేశారు?. వంటి విషయాలపై సీబీఐ దృష్టిసారించింది. ఇక ఘోష్‌తో పాటు ఈ ఘటనకు సంబంధించి వైద్యులు, పోలీసు అధికారులతో సహా 40 మందిని ప్రశ్నించాలని భావిస్తున్న సీబీఐ అధికారులు ఇప్పటికే 20 మంది వ్యక్తులను ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహితపై అఘాయిత్యం.. భర్తతో కలిసి మద్యం సేవించి ఆపై...