ఆ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమాలో చూపిన దానికన్నా ఎక్కువ చేశారు..
చనిపోయిన రోగిని ఐసియులో పెట్టి, చికిత్స చేస్తున్నట్లు హడావుడి సృష్టించి, తాము ఎంత ప్రయత్నించినా రోగి బతకలేదని చెప్పి, లక్షల రూపాయల బిల్లు గుంజడానికి ప్రయత్నించే ఓ దృశ్యం ఠాగూర్ సినిమాలో చూశాం. కార్పొరేట్ ఆస్పత్రుల మోసాలను ఎండగట్టిన ఈ దృశ్యం ప్రేక్ష
చనిపోయిన రోగిని ఐసియులో పెట్టి, చికిత్స చేస్తున్నట్లు హడావుడి సృష్టించి, తాము ఎంత ప్రయత్నించినా రోగి బతకలేదని చెప్పి, లక్షల రూపాయల బిల్లు గుంజడానికి ప్రయత్నించే ఓ దృశ్యం ఠాగూర్ సినిమాలో చూశాం. కార్పొరేట్ ఆస్పత్రుల మోసాలను ఎండగట్టిన ఈ దృశ్యం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తమిళనాడులో వాస్తవంగా జరిగిన ఓ ఉదంతాన్ని తెలుకుంటే… ఠాగూర్ సినిమాలో చూపినదాన్ని మించి మోసంగా ఎవరైనా అంగీరిస్తారు. తమిళనాడు - కేరళ సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామంలో మణికంఠన్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
అతడిని సేలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయినా అతను బతకలేదు. అయితే రూ.3 లక్షలు బిల్లు వేసింది ఆస్పత్రి. అంత డబ్బులు తాము చెల్లించలేమని మృతుని బంధువులు చెప్పారు. దీంతో మృతుని శరీరం నుంచి మూత్రపిండాలు, కళ్లును తీసేసుకున్నారు ఆస్పత్రి వైద్యులు. మణికంఠన్ బంధువులకు మాయమాటలు చెప్పి, అవయవదానం చేస్తున్నట్లు సంతకాలు చేయించుకుని ఈ పని చేశారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేటప్పుడు జరిగిన మోసాన్ని గుర్తించారు.
స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వార్త కేరళ సిఎం పినరయ్ విజయన్ దాకా వెళ్లింది. సంబంధిత ఆస్పత్రిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన తమిళనాడు సిఎంకు లేఖ రాశారు. ఇలాంటి ఆస్పత్రులను శాశ్వతంగా మూసేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అవయవాలను చోరీ చేయడానికి సహకరించిన వైద్యుల వైద్య పట్టాను రద్దు చేయాలని కూడా రోగులు కోరుతున్నారు.