Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాణం తీసుకునేందుకు ఇదో కారణమా? భర్త అక్కడికి రానన్నాడని ఉరి వేసుకుంది....

ఈమధ్య కాలంలో మనుషులకు ఓర్పు చచ్చిపోతోంది. ఫలితంగా వాళ్లు కూడా చచ్చిపోతున్నారు. ఇదివరకు ఎన్ని కష్టాలు, నష్టాలు, చివరికి పేదరిక కారణంగా ఆకలితో అలమటించిపోతున్నా, దారుణమైన కష్టాల కడలిలో ఈదులాడాల్సి వచ్చినా ప్రాణాలను మాత్రం తీసుకునేవారు కాదు. ఎందుకంటే అప్

Advertiesment
ప్రాణం తీసుకునేందుకు ఇదో కారణమా? భర్త అక్కడికి రానన్నాడని ఉరి వేసుకుంది....
, సోమవారం, 4 జూన్ 2018 (13:24 IST)
ఈమధ్య కాలంలో మనుషులకు ఓర్పు చచ్చిపోతోంది. ఫలితంగా వాళ్లు కూడా చచ్చిపోతున్నారు. ఇదివరకు ఎన్ని కష్టాలు, నష్టాలు, చివరికి పేదరిక కారణంగా ఆకలితో అలమటించిపోతున్నా, దారుణమైన కష్టాల కడలిలో ఈదులాడాల్సి వచ్చినా ప్రాణాలను మాత్రం తీసుకునేవారు కాదు. ఎందుకంటే అప్పుడు ప్రాణం ఎంత విలువైనదో చెప్పే పెద్దవారు వుండేవారు. ఒకవేళ బలవంతంగా చనిపోతే ఏం జరుగుతుందో చెప్పేవారు కూడా. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. బలవంతంగా చచ్చిపోవడం అనేది కామన్ అయిపోయింది. మాట వినకపోతే అంతే. ప్రాణం తీసుకోవడమే. ఇక రెండో మాట లేదు.
 
ఇలాంటి సింపుల్ కారణం వల్ల కొత్తగా పెళ్లయిన జంట తమ ఉసురు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లా రొయ్యలగూడెం మండలం చొప్పనరామన్నగూడేనికి చెందిన విజయరాజు, ప్రియాంకలకు నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. వివాహమయ్యాక కాపురం ఎక్కడ పెట్టాలన్న చర్చ వచ్చింది. దాంతో దంపతులు మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి ఈ వ్యవహారం మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. తెలంగాణ రాజధాని హైదారాబాద్‌లో కాపురం పెట్టాలని ప్రియాంక పట్టుబట్టింది.
 
ఐతే భర్త మాత్ర ససేమిరా అన్నాడు. పుట్టిన ఊరు వదిలి ఒక్క అడుగు కూడా వేయడం కుదరదని గట్టిగా చెప్పేశాడు. దీనితో మనస్తాపం చెందిన ప్రియాంక ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణించిందని తెలుసుకుని భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరూ ఇలా బలవన్మరణం పాలవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఆపరేషన్ గరుడు'... నిర్మాత, దర్శకుడు, రచయిత చంద్రబాబు: కృష్ణారావు సంచలనం