Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడు మోసం చేసాడని ఫిర్యాదు చేసేందుకు వెళితే అత్యాచారం చేసిన ఇన్‌స్పెక్టర్

ప్రియుడు మోసం చేసాడని ఫిర్యాదు చేసేందుకు వెళితే అత్యాచారం చేసిన ఇన్‌స్పెక్టర్
, మంగళవారం, 7 డిశెంబరు 2021 (12:10 IST)
ఇటీవలికాలంలో ఆడవారి మానప్రాణాలకు సాధారణ పౌరుల నుంచే కాదు.. చివరకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటుల నుంచి కూడా వారికి భద్రత లేకుండా పోతోంది. తాజాగా, తనను మోసం చేసిన ప్రియుడిపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లిన ఓ యువతి ఆ ఠాణాలోని ఇన్‌స్పెక్టర్ అత్యాచారం చేశాడు. దీంతో ఆ యువతి గర్భందాల్చడంతో ఓ వైద్యురాలి సాయంతో అబార్షన్ చేయించాడు. తనకు జరిగిన మోసాన్ని డీఎస్పీ, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఇన్‌స్పెక్టర్‌, అబార్షన్ చేసిన వైద్యురాలుతో పాటు 8 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో జరిగింది. 
 
జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ (32) ఓ వ్యక్తితో వివాహమైంది. ఈమెకు తొమ్మిదేళ్ళ కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఆ మహిళ భర్తతో విడాకులు తీసుకుని మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంమది. అయితే, అతను కొంతకాలం సంసారం చేసి మహిళను మోసం చేశాడు. 
 
దీనిపై ఫిర్యాదు చేసేందుకు పళుగల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ఇన్‌స్పెక్టర్ సుందరలింగం (40) అనే వ్యక్తి సాయం చేస్తానని నమ్మించి, పలు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె గర్భందాల్చినట్టు తేలడంతో ఓ క్లీనిక్‌కు తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. 
 
దీంతో సుందరలింగంపై ఫిర్యాదు చేసేందుకు పలుమార్లు స్టేషన్‌కు వెళ్లింది. కానీ, పోలీసులు ఆమె ఫిర్యాదను స్వీకరించలేదు. చివరకు డీఎస్పీ, ఎస్పీలను కూడా ఆశ్రయించింది. అయినా నిరాశే ఎదురైంది. 
 
దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా, అత్యాచారానికి పాల్పడిన సుందరలింగం, అబార్షన్ చేసిన డాక్టర్ కార్మల్ రాణి (38)తో సహా 8 మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇల్లు కట్టాలనుకుంటున్నారా.. రూ.20 నుంచి రూ.40 వరకు సిమెంట్ తగ్గింపు