Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యాభర్తల గొడవలు.. బావిలో పిల్లల్ని పడేసిన జవాన్

Advertiesment
భార్యాభర్తల గొడవలు.. బావిలో పిల్లల్ని పడేసిన జవాన్
, మంగళవారం, 11 జనవరి 2022 (15:49 IST)
భార్యాభర్తల గొడవలకు పిల్లలు బలైపోయారు. ఆడుకుంటున్న తన కొడుకు, కూతురిని తీసుకెళ్లి కన్న తండ్రి బావిలో పడేశాడు ఓ జవాన్. ఈ  ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాకు చెందిన రామ్ కుమార్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ తన ఇద్దరు కన్న బిడ్డలను కడతేర్చాడు. వారిని వ్యవసాయబావిలో పడేశాడు. 
 
పండుగ సెలవులు కావడంతో ఇంటివద్ద ఆడుకుంటున్న తన ఇద్దరు పిల్లలను నమ్మించి పొలం వద్ద ఉన్న బావి వద్దకు తీసుకెళ్లాడు. కొడుకు అమ్మి జాక్సన్, కూతురు జానీ బేస్టోను వ్యవసాయ బావిలోకి నెట్టాడు. ఇంకొద్ది రోజుల్లో కొడుకు పుట్టిన రోజు ఉండగా ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
 
ఇది ఆలస్యంగా గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని పిల్లల్ని బయటకు తీసేలోపే వారు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల్ని బావిలోకి తోసేసిన అనంతరం వారి తండ్రి అక్కడి నుంచి పారిపోయాడు.
 
 
ఈ నిందితుడు ప్రస్తుతం ముంబయిలో సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య శిరీషతో కుటుంబ కలహాలు ఉన్నాయని ఇరుగుపొరుగువారు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హస్తినలో అన్ని ప్రైవేటు కార్యాలయాలు మూసివేత