Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రిపుల్ తలాక్‌పై జోక్యం చేసుకోం... పార్లమెంట్‌లో చట్టం చేయండి : సుప్రీంకోర్టు

దేశప్రజలు సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూసిన ట్రిపుల్ తలాక్ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. ట్రిపుల్ తలాక్ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేస్తూనే

ట్రిపుల్ తలాక్‌పై జోక్యం చేసుకోం... పార్లమెంట్‌లో చట్టం చేయండి : సుప్రీంకోర్టు
, మంగళవారం, 22 ఆగస్టు 2017 (11:12 IST)
దేశప్రజలు సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూసిన ట్రిపుల్ తలాక్ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. ట్రిపుల్ తలాక్ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేస్తూనే.. ఈ విషయంపై పార్లమెంట్‌లో చట్టం చేయాలని సూచన చేసింది. అప్పటివరకు ఓ ఇంజెక్షన్ ఆర్డర‌ను జారీచేసింది. అంతేకాకుడా, ట్రిపుల్ తలాక్‌పై ఇప్పటివరకు జరిగిన విచారణను రిజర్వులో ఉంచింది.  
 
అసలు కేసులో తాము కల్పించుకోవాలన్న ఉద్దేశం లేదని, అయితే, కేసు తీవ్రత దృష్ట్యా, తాత్కాలిక ఆదేశాలు ఇస్తూ, నిర్ణయాధికారాన్ని పార్లమెంట్‌కే వదిలేస్తున్నట్టు తెలిపింది. ముస్లిం సమాజంతోపాటు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ తలాక్ విషయంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 
 
సుదీర్ఘకాలంగా వాదనలు ఆలకించిన న్యాయస్థానం, ట్రిపుల్ తలాక్‌పై ఆరు నెలల పాటు స్టే విధిస్తున్నామని, ఈలోగా చట్ట సవరణ చేసి, ట్రిపుల్ తలాక్ చెల్లకుండా పార్లమెంటులో నూతన చట్టం తేవాలని కోరింది. ఇన్ స్టంట్‌గా మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యను వదిలించుకోవాలని చూడటం అత్యంత హేయమైన చర్యని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. 
 
ఫోన్ లేదా సామాజిక మాధ్యమాల్లో తలాక్ చెప్పడం చట్ట సమ్మతం కాదని, అటువంటివి చెల్లబోవని పేర్కొంది. కొత్త చట్టం తెచ్చేటప్పుడు ముస్లిం లాబోర్డు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంట్‌కు సుప్రీంకోర్టు సూచన చేసింది. దీంతో ట్రిపుల్ తలాక్ అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో చట్ట రూపకల్పనకు ప్రభుత్వం నడుంబిగిస్తుందో లేదో వేచి చూడాల్సివుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిమ్ జోంగ్ ఉన్ కదలికలపై నిఘా : కదనరంగంలోకి యూఎస్ 'డ్రాగన్ లేడీ' (Video)