దేశంలో బిచ్చగాళ్లపై సర్వే జరిగింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 4 లక్షల మంది బిచ్చగాళ్లు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.భారతదేశంలో ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా నిరుపేదలు భిక్షాటనపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో బిచ్చగాళ్ల సర్వేను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా నిర్వహించిన గత సర్వే ప్రకారం 4,13,670 మంది బిచ్చగాళ్లు ఉన్నారు. భారతదేశంలో పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక సంఖ్యలో బిచ్చగాళ్ళు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 81,244 మంది బిచ్చగాళ్లు ఉండగా, వారిలో 4,323 మంది 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే.
65,835 మంది బిచ్చగాళ్లతో ఉత్తరప్రదేశ్, 30,219 మంది బిచ్చగాళ్లతో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తమిళనాడులో 6,814 మంది బిచ్చగాళ్లు ఉండగా, వీరిలో 782 మంది 19 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని తేలింది.