Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లేట్ నైట్.. సోషల్ మీడియా వుండగా.. ఇక నిద్రెందుకు దండగ!? (video)eo)

mobile phone
, గురువారం, 7 ఏప్రియల్ 2022 (11:21 IST)
హైదరాబాదీయులు ఎక్కువ సేపు నిద్ర పోవట్లేదని తాజా అధ్యయనంలో తేలింది. కొందరు ఉద్యోగాల కోసం రాత్రి పూట లేటుగా నిద్రపోతుంటే.. కొందరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నిద్రను త్యాగం చేస్తున్నారు. ఇంకొందరు సోషల్ మీడియా ఉంటుండగా నిద్రపోవడం లేదని చెబుతున్నారు. అర్థరాత్రి పూట సోషల్ మీడియా గడిపే వారు హైదరాబాదులో అధికమవుతున్నారని వేక్‌ఫిట్ గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్ 2022 సర్వేలో తేలింది.  
 
జనాల్లో నిద్ర అలవాట్లపై  ‘వేక్ ఫిట్’ సంస్థ దేశవ్యాప్తంగా ఈ ఏడాది మెట్రో నగరాల్లో ‘గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ 2022 ’సర్వే రిపోర్ట్ ని ఇటీవల రిలీజ్​ చేసింది. ఇందులో ఫోను వాడుతూ రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతున్న వాళ్ల సంఖ్య దేశవ్యాప్తంగా 57శాతం పెరిగిందని పేర్కొంది. 
 
ముఖ్యంగా హైదరాబాదీల్లో గతేడాదితో పోలిస్తే పడుకునే ముందు ఫోన్ వాడే వారి సంఖ్య తగ్గినప్పటికి, నిద్రలేమితో బాధపడుతున్నవారి సంఖ్య 32 శాతం పెరిగినట్లు తెలిపింది. ప్రతి పదిమంది హైదరాబాదీల్లో నలుగురు రాత్రిళ్లు సోషల్ మీడియా వాడుతూ.. నిద్రకు దూరమవుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో  దాదాపు 14 ప్రశ్నలు అడిగారు.   
 
రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుంటే వివిధ రకాల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది.  లేట్ నైట్ ఫోన్లు వాడకం, సోషల్ మీడియా ఎక్కువ వాడటం  వల్ల కంటి సంబంధిత సమస్యల్లో చిక్కుకుంటారు.  దీంతో పాటు  నిద్రలేమి (ఇన్​సోమ్నియా), హార్ట్ బీట్‌లో ఇబ్బందులు, హార్మోనల్ ఇంబాలెన్స్,  బరువుపెరగడం,  ఉదయం నిద్రపోయే అలవాటు పెరగడం, భవిష్యత్‌లో కార్డియో సంబంధిత సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి  సమస్యలు వస్తాయి. 
 
మహిళల్లో సంతాన లేమి సమస్యలు, పీరియడ్ సైకిల్ సక్రమంగా రాకపోవడం వంటివి కూడా వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరికీ సరైన నిద్ర అవసరం’ అని డాక్టర్లు అంటున్నారు. మగవారితో పోలిస్తే ఆడవారిలోనే అధికంగా నిద్రలేమి భయాలు ఉన్నట్లు తేలింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ పదో తరగతి పరీక్షా సమయంలో మార్పు