అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యంపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించేందుకు అవసరమైన చట్టబద్ధ వయస్సును 25 ఏళ్ల నుండి 21 ఏళ్లకు కుదించినట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా వెల్లడించారు.
నూతన మద్యం పాలసీ ప్రకటన చేసిన ఆయన.. ఈ మార్పుల వల్ల వార్షిక ఎక్సైజ్ రెవెన్యూ 20 శాతం పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. కొంత మంది మంత్రుల సిఫార్సు మేరకు ఈ నూతన మద్యం పాలసీకి క్యాబినేట్ ఆమోద ముద్ర వేసిందని అన్నారు.
అయితే ఢిల్లీలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయకూడదని, అదేవిదంగా కొత్త వాటిని అనుమతులివ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుక్నుట్లు చెప్పారు. ప్రస్తుతం 60 శాతం లిక్కర్‌షాపులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని అన్నారు.
ఈ మార్పులతో నగరంలో లిక్కర్ మాఫియాకు కళ్లెం పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో 850 మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, కానీ లిక్కర్ మాఫియా 2వేలకు పైగా అక్రమంగా దుకాణాలను నడుపుతుందని అన్నారు.
గత రెండేళ్లలో సుమారు 7 లక్షల అక్రమ లిక్కర్ బాటిళ్లను సీజ్ చేశామని, 1939 మంది నిందితులు అరెస్టు చేశామని తెలిపారు.