Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోకర్, రమ్మీ అనేవి నైపుణ్య సంబంధిత ఆటలని తేల్చిన ఐఐటి - దిల్లీ

Advertiesment
brain
, సోమవారం, 4 సెప్టెంబరు 2023 (18:47 IST)
ప్రముఖ ఐఐటి-ఢిల్లీ ప్రొఫెసర్ తపన్ కె. గాంధీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్‌కు సంబంధించిన కాడెన్స్ చైర్ ప్రొఫెసర్ ఇటీవల తన బృందంతో కలిసి పోకర్, రమ్మీ నైపుణ్యానికి సంబంధించిన ఆటలు అని ధ్రువీకరిస్తూ విస్తృతమైన అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం “ఆన్‌లైన్ పోకర్, రమ్మీ- గేమ్ ఆఫ్ స్కిల్ లేదా ఛాన్స్?” అనే అంశంపై జరిగింది. పోకర్, రమ్మీలో విజయానికి అవసరమైన అభిజ్ఞా, ఇతర నై పుణ్యాల ప్రాముఖ్యతను ఇది బలపరుస్తుంది. ఇది గేమ్‌లో అనుభవం, నేర్చుకోగల నైపుణ్యాల ప్రభావాన్ని, క్రీడలో ఆటగాడి దీర్ఘకాలిక విజయంలో అది పోషిస్తున్న పాత్రను మరింత విశ్లేషించింది.
 
నివేదికపై వ్యాఖ్యానిస్తూ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్, ఏఐ- ఆటోమేషన్ కాడెన్స్ చైర్ ప్రొఫెసర్, ఐఐటి దిల్లీ తపన్ కె. గాంధీ  ఇలా అన్నారు. ‘‘ఆన్‌లైన్ గేమింగ్ గురించి కొనసాగుతున్న సంభాషణలు, పక్షపాత భావనల మధ్య ముందస్తు అంచనాల కారణంగా అపోహలు ఏర్పడ్డాయి. ఈ ఆట నైపుణ్యంపై దృష్టి సారిస్తుందా లేదా అదృష్టం ప్రబలంగా ఉంటుందో లేదో అర్థం చేసుకోవడానికి వివిధ ఆటగాళ్ల గేమ్‌ ప్లేను పూర్తిస్థాయి అధ్యయనం పరిశీలించింది. మా అధ్యయనం అంతటా, ఈ క్రీడలకు క్రీడాకారుల అభిజ్ఞా సామర్థ్యాలను పెంపొందించడంలో సహాయపడే సహజమైన అవగాహన స్థాయి అవసరమని స్పష్టం చేసే అద్భుతమైన సందర్భాలు మాకు అందించబడ్డాయి. నైపుణ్యాన్ని క్రీడకు పరిమితం చేయడమే కాకుండా, సామాజిక సూచనలను అర్థం చేసుకోవడం, అధిక ఒత్తిడి పరి స్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం, జ్ఞాపకశక్తి నిలబెట్టుకోవడం వంటివి, వారు నిలకడగా ఆడు తున్న సమయంలో పురోగమించడం వంటి సాఫ్ట్ నైపుణ్యాలను కూడా మేం గమనించాం’’ అని అన్నారు.
 
"ఆన్‌లైన్ పోకర్ మరియు రమ్మీ- గేమ్ ఆఫ్ స్కిల్ లేదా ఛాన్స్?" అనే అంశంపై మా అధ్యయనాన్ని పంచుకోవడానికి మేం సంతోషిస్తున్నాం, ఇది ఆటలు అదృష్టంతో నడిచేవనే గతకాలపు అపోహలను తొలగిస్తుంది. విజయవం తం కావడానికి అవసరమైన నైపుణ్యాన్ని చాటిచెబుతుంది" అని తపన్ గాంధీ అన్నారు.
 
పోకర్ గేమ్ ఆఫ్ స్కిల్ అని ధ్రువీకరించే మునుపటి నివేదికను ప్రచురించడంలో ఐఐఎం కోజికోడ్‌లోని స్ట్రాటజిక్ మేనే జ్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ దీపక్ ధయనిధి కీలకపాత్ర పోషించారు. ఆయన ఈ అధ్యయనంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు, "పోకర్, రమ్మీ వంటి ఆన్‌లైన్ కార్డ్ గేమ్‌ల రంగంలో, ఈ విశ్లేషణ  ఎటువంటి సందేహాలను మిగల్చదు. దీర్ఘకాలిక విజయం వెనుక చోదక శక్తి అవకాశం కాదు, నైపుణ్యం. స్కిల్ వేరియబుల్స్‌లో నాన్-లీనియర్ ట్రెండ్‌లు, విజేత శాతాలు మారుతూ యాదృచ్ఛికతను ధిక్కరిస్తాయి. ఆటగాళ్ల నైపుణ్యం, సహనాన్ని నిస్సందేహంగా సూచిస్తాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ నైపుణ్యానికే పెద్దపీట. ఆటగాళ్ళు సవాళ్లను ఎదుర్కోవడంలో ఆరితేరడంతో క్రికెట్, గోల్ఫ్ మొదలైన ఇతర క్రీడలలో వలె వైవిధ్యాన్ని తగ్గిస్తుంది. మన అభిజ్ఞా పరాక్రమం గ్రహణ శక్తిని మెరుగుపరచడం ద్వారా గేమింగ్ రంగంలో నైపుణ్యం ప్రబలంగా ఉంటుందని అధ్యయనం నిర్ధారిస్తుంది’’ అని అన్నారు.
 
ఈ ఐఐటీ అధ్యయనం ఆన్‌లైన్ పోకర్, రమ్మీలో దీర్ఘకాలిక విజయాన్ని నైపుణ్యానికి ఆపాదించవచ్చో లేదో తెలుసుకోవడానికి గణిత సాధనాలను ఉపయోగించి పరిమాణాత్మక విశ్లేషణను అందిస్తుంది. 2-ప్లేయర్, 3-ప్లేయర్, 6-ప్లేయర్ ఫార్మాట్‌లలో 30 నుండి 100 గేమ్‌ల మధ్య ఆడిన వినియోగదారు డేటాతో డేటా విశ్లేషించబడింది. పోకర్, రమ్మీ రెండింటిలోనూ, వినియోగదారులు ఎక్కువ గేమ్‌లు ఆడుతున్నందున నైపుణ్యం వేరియబుల్స్ మెరుగుపడతాయని పరిశోధనలు సూచించాయి. ఇంకా, వినియోగదారుల గెలుపు రేట్ల మధ్య కొలవబడిన సహసంబంధం 0.904, ఇది సానుకూల సంబంధాన్ని సూచిస్తుంది, గేమ్‌లో నైపుణ్యం పట్టుదలను నొక్కి చెబుతుంది. ఇది వరుస వ్యవధిలో ఫలితాలను రూపొందించడంలో కేవలం అవకాశం కంటే నైపుణ్యం ప్రాముఖ్యతను చాటిచెబుతుంది. ఆట సూక్ష్మ నై పుణ్యాలు, వ్యూహాలపై పట్టు సాధించడం ఒకరి పని తీరును గణనీయంగా మెరుగుపరుస్తుంది అనే వాస్తవాన్ని విన్ రేట్లలోని స్థిరత్వం చాటిచెబుతుంది. అటువంటి బలమైన సహసంబంధం ఆట చిక్కులను అర్థం చేసుకోవడంలో సమయాన్ని, కృషిని పెట్టుబడి పెట్టే ఆటగాళ్ళు అధిక విజయ రేటును కొనసాగించడానికి మెరుగైన అవకాశాలను కలిగి ఉంటారని సూచిస్తుంది.
 
అందువల్ల, అధ్యయనం ఇలా నిర్ధారించింది: 1) నైపుణ్యాల ఆవశ్యకత కోణం నుండి రమ్మీ, పోకర్ యొక్క ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ వెర్షన్‌లలో తేడా లేదు మరియు 2) రమ్మీ, పోకర్‌లో, విజయం సాధించేందుకు ఛాన్స్ కంటే నైపుణ్యాలకు ప్రాధాన్యత ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గద్వాల అసెంబ్లీ ఎమ్మెల్యేగా డీకే అరుణ