Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను కోవిడ్ రోగిని.. నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా : శివరాజ్ సింగ్ చౌహాన్

నేను కోవిడ్ రోగిని.. నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా : శివరాజ్ సింగ్ చౌహాన్
, మంగళవారం, 28 జులై 2020 (14:07 IST)
తాను కోవిడ్ రోగినని, అందువల్ల తన బట్టలు తానే ఉతుక్కుంటుంన్నట్టు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ బారినపడిన ఆయన.. ప్రస్తుతం భోపాల్‌లోని చిరాయు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న భార్య‌కు మాత్రం వైర‌స్ ప‌రీక్ష‌లో నెగ‌టివ్ వ‌చ్చింది. 
 
హాస్పిట‌ల్ నుంచి సీఎం శివ‌రాజ్‌.. వ‌ర్చువ‌ల్ వీడియోలో మాట్లాడారు. తాను కోవిడ్ పాజిటివ్ పేషెంట్‌ను అని, త‌న బ‌ట్ట‌ల్ని తానే ఉతుక్కుంటున్న‌ట్లు చెప్పారు. అయితే త‌న బ‌ట్ట‌ల్ని తానే ఉతుక్కోవ‌డం వ‌ల్ల త‌న‌కు బెనిఫిట్ జ‌రిగింద‌న్నారు. త‌న చేతికి ఇటీవ‌ల శ‌స్త్ర‌చికిత్స జ‌రిగింద‌ని, ఎన్నోసార్లు ఫిజియోథెర‌పి చేయించినా.. పిడికిలి ప‌ట్టుకోవ‌డం వ‌చ్చేది కాదు అని, కానీ బ‌ట్ట‌లు ఉత‌కడం ప్రారంభించిన త‌ర్వాత ఇప్పుడు త‌న చేయి సులువుగా ప‌నిచేస్తున్న‌ట్లు సీఎం ఓ వీడియోలో వెల్ల‌డించారు. 
 
సోమ‌వారం కూడా సీఎం శివ‌రాజ్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారానే త‌న విధుల‌ను నిర్వ‌ర్తించారు. రెండ‌ో సారి కూడా ఆయ‌న శ్యాంపిల్‌లో క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలింది. క్యాబినెట్‌లోని న‌రోత్త‌మ్ మిశ్రా, విశ్వాస్ సారంగ్‌, ప్ర‌భురామ్ చౌద‌రీల‌కు కొన్ని బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. హాస్పిట‌ల్‌లో చికిత్స పొందిన‌న్ని రోజులు సీఎం ఎటువంటి ఫైళ్ల‌పై సంత‌కం చేయ‌ర‌న్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎనిమిదేళ్ల బాలికపై రిక్షావాలా అత్యాచారం.. వరండాలో నిద్రపోతున్న బాలికను..?