తిరుమల తిరుపతి దేవస్థానం మానవాళి ఆరోగ్యం కోసం అద్భుత యాగాన్ని నిర్వహించింది. తిరుమలలోని వేదపాఠశాలలో మహాసుదర్సన సహిత విశ్వశాంతి యాగాన్ని నిర్వహించారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఎంతో ఘనంగా విశ్వశాంతి యాగం జరిగింది.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	టిటిడికి చెందిన వేదపండితులు, అలాగే వేదపాఠశాలలోని విద్యార్థులు విశ్వశాంతి యాగంలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన యాగం మధ్యాహ్నం వరకు సాగింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో ఒక్కసారిగా వేదపాఠశాల మారుమ్రోగింది.
 
									
										
								
																	
	 
	గత కొన్నిరోజుల ముందే టిటిడి కరోనా అంతరించిపోవాలని యాగాన్ని నిర్వహించారు. ఏకధాటిగా రెండునెలల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఆలయం ముందు పండితులు స్వామివారిపై కీర్తనలను ఆలపించారు. ప్రపంచాన్ని పట్టి పీటిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ సురక్షితంగా బయటపడాలని టిటిడి అధికారులు పలు కార్యక్రమాలు నిర్వహించారు.